విషాదం : నాసిక్ లో బస్సులో చెలరేగిన మంటలు.. పదకొండుకు చేరిన మృతుల సంఖ్య...

Published : Oct 08, 2022, 07:33 AM ISTUpdated : Oct 08, 2022, 09:48 AM IST
విషాదం : నాసిక్ లో బస్సులో చెలరేగిన మంటలు.. పదకొండుకు చేరిన మృతుల సంఖ్య...

సారాంశం

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగి పదకొండు మంది మృతి చెందారు.

మహారాష్ట్రలోని నాసిక్‌లో శుక్రవారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో పదకొండుమంది మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు శనివారం ఉదయం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం తెల్లవారుజామున నాసిక్-ఔరంగాబాద్ హైవేపై లగ్జరీ ప్యాసింజర్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ సమయంలో బస్సులో ప్రయాణికులు ఉండిపోయారు. దీంతో ఎనిమిదిమంది సజీవదహనం కాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మరో ముగ్గురు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. ఘటనకు సంబంధించి  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్