బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. గణతంత్ర దినోత్సవం రోజు ప్రదర్శించాలని కేరళ కాంగ్రెస్ సన్నాహకాలు.. మండిపడ్డ బీజేపీ

By team teluguFirst Published Jan 24, 2023, 12:35 PM IST
Highlights

బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ నిషేధిత డాక్యుమెంటరీని జనవరి 26వ తేదీన ప్రదర్శించాలని కేరళ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై బీజేపీ మండిపడింది.

జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించాలని కేరళ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ డాక్యూమెంటరీపై కేంద్ర ప్రభుత్వం ఇది వరకే నిషేధం విధించింది. అయినా వాటిని ధిక్కరిస్తూ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) మైనారిటీ సెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ డాక్యుమెంటరీ పక్షపాతంతో కూడినదా కాదా అని నిర్ణయించుకునేందుకు ప్రజలకే అవకాశం ఇవ్వాలని పేర్కొంది.

నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు.. ప‌ది రాష్ట్రాల‌కు హెచ్చ‌రిక‌లు, ఢిల్లీలో మ‌ళ్లీ పెరిగిన చ‌లి

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశ్నించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన క్లిప్ లను కూడా షేర్ చేయకూడదని పేర్కొంది. అయితే ఈ నిషేధం ఉన్నప్పటికీ అనేక విశ్వవిద్యాలయాలు ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు ఇంట్రెస్ట్ చూపించాయి. అయితే వాటి జాబితాలోనే ఇప్పుడు కేపీసీసీ మైనారిటీ సెల్ చేరింది. దీని కోసం గణతంత్ర దినోత్సవాన్ని ఎంచుకుంది. 

దీనిపై విమర్శలు రావడంతో కేపీసీసీ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. కేంద్రానికి నిరసనగా దీనిని ప్రదర్శిస్తున్నామని తెలిపింది. డాక్యుమెంటరీని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ‘‘డాక్యుమెంటరీని బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్ధం.. మోడీ ప్రభుత్వం దాన్ని ఎలా నిషేధిస్తుంది.. ఇది కేంద్రంపై మా (మైనారిటీ) నిరసన’’ అని కేపీసీసీ అడ్వకేట్ షిహాబుద్దీన్ అన్నారు. దీనిపై కేంద్రం నిషేధం విధించి అందరి నిర్ణయం తీసుకునే బదులు, ప్రజలే ఈ డాక్యుమెంటరీని చూసి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మహారాష్ట్రలో ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడ్డ స్కూటర్.. ఇద్దరు మృతి..

‘‘ఈ ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీని ఎలా అడ్డుకుంటుంది ? ఏది తప్పు ఏది కాదో ఈ దేశ ప్రజలే నిర్ణయించుకోనివ్వండి. అల్లర్లలో వేలాది మంది మరణించిన గుజరాత్‌కు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఎలా విశ్వసిస్తాము’’ అని కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ అన్నారు. ఈ అంశంపై బీజేపీకి చెందిన టామ్ వడక్కన్ స్పందిస్తూ.. ఇది భారతదేశాన్ని విభజించడానికి పనిచేస్తున్న దేశ వ్యతిరేకుల పర్యావరణ వ్యవస్థ చర్య అని అన్నారు. ఇది కేవలం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరుగుతోందని ఆయన అన్నారు. 

ఇదిలావుండగా ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనను రద్దు చేయాలని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) సోమవారం విద్యార్థుల బృందాన్ని కోరింది. అయితే ఈ డాక్యుమెంటరీ కచ్చితంగా ప్రదర్శిస్తామని జేఎన్ యుఎస్ యు సభ్యుడు ఒకరు తెలిపారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. కాగా.. హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది.

జ‌మ్మూకాశ్మీర్ లో పోటీకి సై.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పూర్తి శ‌క్తితో పోరాడతామని ఆప్ ప్రకటన

ఈ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రెండు రోజుల కిందట స్పందించారు. భారతదేశంలోని కొంతమంది ఇప్పటికీ వలసరాజ్యాల మత్తు నుండి ఇంకా బయటపడలేదని అన్నారు. అలాంటి వ్యక్తులు బీబీసీని భారత సుప్రీంకోర్టు కంటే ఎక్కువగా పరిగణిస్తారని, తమ నైతిక గురువులను సంతోషపెట్టడానికి దేశం గౌరవాన్ని, ప్రతిష్టను ఏ స్థాయిలోనైనా తగ్గించేందుకు సిద్ధంగా ఉంటారని ఆరోపించారు.

click me!