మహిళా ఆర్టీసీ కండక్టర్‌పై యాసిడ్ దాడి: ఆరు నెలల్లో రెండోసారి

By sivanagaprasad KodatiFirst Published Dec 20, 2019, 2:49 PM IST
Highlights

దేశ ఐటీ రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. 

దేశ ఐటీ రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. బాగలగుంటెకి చెందిన 35 ఏళ్ల మహిళా కండక్టర్ విధులకు హాజరయ్యేందుకు గురువారం ఉదయం 5.30కి ఇంటి నుంచి బయలుదేరారు.

అప్పటికే అక్కడ కాపుకాసి వున్న ఇద్దరు అగంతకులు కండక్టర్‌పై యాసిడ్ పోసి పరారయ్యారు. బాధితురాలి అరుపులు, కేకలతో వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

ఈమె గత 18 సంవత్సరాలుగా బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్(బీఎంసీ)కి చెందిన పీన్యా డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త బాలాజీ కూడా ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా సదరు మహిళా కండక్టర్‌పై ఆరు నెలల క్రితం కూడా దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

Also Read:

ఉన్నావ్ రేప్‌ కేసు:బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు

పాలకులు కాదు కీచకులు: అధికారం ముసుగులో మహిళలపై అత్యాచారాలు

ఉన్నావ్ అత్యాచార ఘటనలో బీజేపీ ఎమ్మెల్యేను దోషిగా తేల్చిన న్యాయస్థానం

click me!