సంస్కృత శ్లోకాలు నేర్పితే... అత్యాచారాలు చేయరు.. మహా గవర్నర్ షాకింగ్ కామెంట్స్

By telugu teamFirst Published Dec 20, 2019, 1:37 PM IST
Highlights

సంస్కృత శ్లోకాలు నేర్పితే... అత్యాచారాలు చేయాలనే ఆలోచన రాదు అంటూ  భగత్ సింగ్ కోషియారీ సంచలన కామెంట్స్ చేశారు. విశ్వవిద్యాలయం విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే మహిళలపై అత్యాచారాలు జరగవని గవర్నర్ భగత్‌​సింగ్​ కోషియారీ చెప్పారు.

ప్రస్తుతం దేశంలో వరసగా పలు అత్యాచారాల ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా... కామాంధుల్లో మార్పులు రావడం లేదు. అమ్మాయిలు, మహిళలు, చిన్నారులు ఒంటరిగా కనపడితే చాలు... అత్యాచారాలకు పాల్పడి.. చంపేస్తున్నారు. కాగా.... వీటిని అదుపు చెయ్యాలంటే ఒకటే మార్గమని చెబుతున్నాడు.. మహారాష్ట్ర గవర్నర్  భగత్ సింగ్ కోషియారీ.

సంస్కృత శ్లోకాలు నేర్పితే... అత్యాచారాలు చేయాలనే ఆలోచన రాదు అంటూ  భగత్ సింగ్ కోషియారీ సంచలన కామెంట్స్ చేశారు. విశ్వవిద్యాలయం విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే మహిళలపై అత్యాచారాలు జరగవని గవర్నర్ భగత్‌​సింగ్​ కోషియారీ చెప్పారు. దేశంలో ప్రతీరోజూ మహిళలపై సాగుతున్న దారుణ అత్యాచారాల ఘటనల నేపథ్యంలో నాగపూర్ యూనివర్శిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ భగత్‌​సింగ్​ కోషియారీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

నాగపూర్ విశ్వవిద్యాలయంలో జమ్నాలాల్ బజాజ్ పరిపాలనా భవనాన్ని ప్రారంభించిన గవర్నరు మాట్లాడుతూ సంస్కృత శ్లోకాలు నేర్చుకుంటే మంచి చెడుల మధ్య ఉన్న అంతరం తెలుస్తుందన్నారు. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండీ శేఖర్ బజాజ్ నుద్ధేశించి గవర్నరు మాట్లాడారు.

 ‘‘ అందరూ కన్యా పూజలు ఇళ్లలో చేస్తుంటారు, మీరు (బజాజ్) కూడా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినందున మీరు కూడా కన్యా పూజ చేసి ఉంటారు, కాని ప్రస్థుతం దేశంలో కొందరు దుష్టులు మహిళలపై అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు...విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే వారు ఇలాంటి దారుణ అత్యాచారాలకు పాల్పడరు’’ అని కోషియారీ వ్యాఖ్యానించారు.

click me!