India ban on Chinese Apps: చైనా ఆప్‌ల‌కు స‌ర్కారు షాక్‌.. మ‌రో 54 యాప్‌ల‌పై నిషేధం !

Published : Feb 14, 2022, 11:32 AM IST
India ban on Chinese Apps: చైనా ఆప్‌ల‌కు స‌ర్కారు షాక్‌.. మ‌రో 54 యాప్‌ల‌పై నిషేధం !

సారాంశం

India ban on Chinese Apps: చైనా యాప్‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి షాక్ ఇవ్వ‌డానికి సిద్ద‌మైంద‌ని స‌మాచారం. దేశ భ‌ద్ర‌తకు ముప్పు ఉన్ననేప‌థ్యంలో 54 చైనా యాప్‌ల‌ను నిషేధించాల‌ని కేంద్రం భావిస్తున్న‌ది. నిషేధిత జాబితాలో స్వీట్ సెల్ఫీ హెడ్‌, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిట‌ర్‌, టెన్‌సెంట్ జీవ‌ర్‌, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్‌, డ్యుయ‌ల్ స్పేస్ లైట్ యాప్‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  

India's ban on Chinese Apps: చైనా యాప్‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి షాక్ ఇవ్వ‌డానికి సిద్ద‌మైంద‌ని స‌మాచారం. దేశ భ‌ద్ర‌తకు ముప్పు ఉన్ననేప‌థ్యంలో 54 చైనా యాప్‌ల‌ను నిషేధించాల‌ని కేంద్రం భావిస్తున్న‌ది. నిషేధిత జాబితాలో స్వీట్ సెల్ఫీ (Sweet Selfie HD), బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా(Beauty Camera - Selfie Camera), వివా వీడియో ఎడిట‌ర్‌ (Viva Video Editor), టెన్‌సెంట్ జీవ‌ర్‌, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్‌, డ్యుయ‌ల్ స్పేస్ లైట్ యాప్‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ఏడాది జూన్‌లో చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేష‌న్ల‌ను బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. వాటిల్లో పాపుల‌ర్ యాప్‌లైన టిక్‌, వీచాట్, హ‌లో కూడా ఉన్నాయి. జాతీయ భ‌ద్ర‌త‌కు, సార్వ‌భౌమాధికారినికి ముప్పు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. 2020 మేలో చైనాతో స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ మొద‌లైన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు 300 యాప్‌ల‌ను నిషేధించారు.

2020లో సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 సంస్థలకు చెందిన యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ సహా పాపుల‌ర్ యాప్‌ల‌పై  కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ యాప్‌ల జాబితాలో టిక్‌టాక్‌‌తో పాటు షేర్‌ ఇట్‌, యూసీ బ్రౌజర్‌, హలో, వీ చాట్‌, బ్యూటీ ప్లస్‌ తదితర కీలక యాప్‌లు ఉన్నాయి. గల్వాన్ లోయలో ఘర్షణలకు కారణమై 20 మంది జవాన్లు అమరులవడానికి కారణమైన చానా వస్తువున్నింటినీ బహిష్కరించాలని దేశవాసులు నుంచి వ‌చ్చిన డిమాండ్‌, జాతీయ భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని యాప్‌ల‌పై నిషేధం విధించింది. 

ఇదే నేప‌థ్యంలోనే అదే ఏడాది (2020) సెప్టెంబ‌ర్ లో కూడా మ‌రోసారి చైనా కు చెందిన ప‌లు యాప్‌ల‌పై కేంద్రం నిషేధం విధించింది. ఏకంగా 118 చైనీస్ మొబైల్ యాప్ లపై కేంద్రం నిషేధం విధించి సంచలనం సృష్టించింది. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్ జీ క్యామ్ కార్డ్ బైడ్ కట్ కట్ సహా మొత్తం 118 యాప్ లు ఉన్నట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ పేర్కొన్న‌ది.  ఈ క్ర‌మంలోనే దేశ భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని చైనా స‌హా ప‌లు దేశాల‌కు చెందిన మ‌రో 54 యాప్‌ల‌పై నిషేధం విధించ‌నుంద‌ని స‌మాచారం. వాటిలో స్వీట్ సెల్ఫీ హెడ్‌, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిట‌ర్‌, టెన్‌సెంట్ జీవ‌ర్‌, ఒన్‌మోజీ ఎరినా, యాప్ లాక్‌, డ్యుయ‌ల్ స్పేస్ లైట్ యాప్‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu
Fresh Snowfall in Sonamarg: మోదీ ప్రారంభించిన సోనమార్గ్ఇప్పుడు ఎలా ఉందో చూడండి| Asianet News Telugu