బాల్ ఠాక్రే సిద్ధాంతాలను శివసేన-బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది - సీఎం ఏక్ నాథ్ షిండే

By team teluguFirst Published Jul 3, 2022, 4:02 PM IST
Highlights

మహారాష్ట్ర శాసన సభలో ఏక్ నాథ్ షిండే మొదటి సారిగా సీఎం హోదాలో మాట్లాడారు. తమ ప్రభుత్వం బాల్ ఠాక్రే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ‌లో నడిపిస్తామని చెప్పారు. 

రాష్ట్రం కొత్త‌గా కొలువుదీరిన శివసేన-బీజేపీ ప్ర‌భుత్వం బాల్ ఠాక్రే సిద్దాంతాల‌ను ముందుకు తీసుకెళ్తుందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీకి చెందిన రాహుల్ నర్వేకర్ ఎన్నికైన తర్వాత ఆయ‌న అసెంబ్లీ ప్ర‌స‌గించారు. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటును, స్పీక‌ర్ ఎన్నిక‌ను ఆయ‌న భారీ విజ‌యంగా అభివ‌ర్ణించారు. 

PM Modi Hyderabad Visit: వచ్చే 30-40 ఏళ్లు బీజేపీ శకం: అమిత్ షా

“ నేను మంత్రిని, మ‌రికొంద‌రు మంత్రులు కూడా ప్రభుత్వాన్ని విడిచిపెట్టారు. బాలాసాహెబ్ ఠాక్రే, ఆనంద్ డిఘేల భావజాలానికి అంకితమైన నాలాంటి సాధారణ కార్మికుడికి ఇది చాలా పెద్ద విషయం’’ అని ఆయన అన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే నమ్మకాల ఆధారంగా ఇప్పుడు బీజేపీ-శివసేన ప్రభుత్వం మహారాష్ట్రలో అధికారం చేపట్టిందని షిండే చెప్పారు. ఇప్పటి వరకు ప్రజలు ప్రతిపక్షం నుంచి ప్రభుత్వం వైపు మారడం చూశాం కానీ ఈసారి ప్రభుత్వ నాయకులు ప్రతిపక్షంలోకి వెళ్లారని ఆయన అన్నారు.సీఎం అయిన తర్వాత షిండే ఏమీ ఆశించడం లేదని, అయితే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందని, తనకు మద్దతిస్తోందని అన్నారు. అనంతరం ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫడ్న‌వీస్ మాట్లాడారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వం మహారాష్ట్ర ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. అందుకు స్పీకర్ చక్కటి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

ఇద్దరు లష్కర్ టెర్రరిస్టులను పట్టుకున్న గ్రామస్తులు.. పోలీసులకు అప్పగింత.. ఊరి ప్రజలకు రూ. 5 లక్షల రివార్డు

ఇదిలా ఉండగా.. పార్టీని వీడిన వ్యక్తి శివసేన సీఎం కాలేడని మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే అన్నారు. శివసేన కార్యకర్తలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, ‘శివసైనికులు’ (షిండే) చివరకు రాష్ట్ర సీఎం అయ్యార‌ని పలువురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు చేసిన వ్యాఖ్యలను ఠాక్రే ఖండించారు. ఇదిలా ఉండ‌గా ఏక్ నాథ్ షిండే కు త‌న గురువు ఆనంద్ డిగ్రేతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. 1986లో పూర్తి స్థాయి స‌మయం కేటాయిస్తూ శివ‌సేన‌లో చేరిపోయారు. రెండు పర్యాయాలు కార్పొరేటర్‌గా పనిచేసిన ఆయన ప‌ని చేశారు. 

PM Modi Hyderabad Visit: తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

2001లో డిఘే మరణించిన తర్వాత, షిండే ఆయ‌న వారస‌త్వాన్ని పునికిపుచ్చుకున్నారు. త‌రువాత శివ‌సేన చీఫ్, ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కుల‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారారు. ఆయ‌న‌కు థానే నుంచి శివ‌సేన ఎమ్మెల్యే టికెట్ కేటాయిచింది. దీంతో ఆయ‌న ఎన్నికల్లో గెలిచారు.  2009, 2014, 2019లో వరుసగా విజయం సాధిస్తూనే వ‌చ్చారు. చివ‌రికి 2022 జూన్ 30వ తేదీన ఆయ‌న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. 

click me!