సిద్ధూ తల తెస్తే రూ. 5 లక్షల బహుమతి

By pratap reddyFirst Published 21, Aug 2018, 8:10 AM IST
Highlights

ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నవజోత్ సింగ్ సిద్ధూ చేసిన పాకిస్తాన్ పర్యటనపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధూపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ చిత్రీకరించిన సంజయ్ జాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

లక్నో: మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ తలను తనకు తెచ్చిస్తే రూ. 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తానని రాష్ట్రీయ భజరంగ్ దళ్ ఆగ్రా శాఖ అధ్యక్షుడు సంజయ్ జాట్ ప్రకటించారు. 

ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నవజోత్ సింగ్ సిద్ధూ చేసిన పాకిస్తాన్ పర్యటనపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధూపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ చిత్రీకరించిన సంజయ్ జాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇమ్రాన్ ప్రమాణస్వీకారం.. సిద్ధు ఎక్కడ కూర్చున్నాడంటే...

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై సిద్ధూ దేశాన్ని మోసం చేశారని ఆయన ఆరోపించారు. భారత సైనికుల రక్తం తాగాలని చూస్తున్న ప్రభుత్వానికి సిద్ధూ మద్దతు ఇచ్చారని ఆయన ఆరోపించారు. 

ఓ కమ్యూనిటీని ఏ రోజు కూడా నమ్మకూడదని గురు గోవింద్ సింగ్ చేసిన బోధనలను సిక్కుగా నవజోత్ సింగ్ సిద్ధూ విస్మరించారని ఆయన అన్నారు. 

Last Updated 9, Sep 2018, 12:32 PM IST