వరదలు: ఆ మంత్రి చేసిన పనికి షాక్, దుమ్మెత్తిపోసిన నెటిజన్లు

By narsimha lodeFirst Published 20, Aug 2018, 5:26 PM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో  బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి హెచ్ డి రేవణ్ణ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. 

బెంగుళూరు:కర్ణాటక రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో  బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి హెచ్ డి రేవణ్ణ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను మంత్రి విసిరేశారు.ఈ వీడియోలు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి.  దీంతో నెటిజన్లు రేవణ్ణపై మండిపడ్డారు.

కర్ణాటక రాష్ట్రంలో కూడ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు.  వరదలతో పునరావాస శిబిరాల్లో బాధితులు తలదాచుకొంటున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలో మంత్రి రేవణ్ణ శనివారం సాయంత్రం పర్యటించారు. వరదలతో నిలువ నీడ లేని కారణంగా క్యాంపుల్లో  వందలాది మంది  పునరావాస శిబిరాల్లో గడుపుతున్నారు.  వరద బాధితుల కోసం తీసుకెళ్లిన ఆహార ప్యాకెట్లను మంత్రి రేవణ్ణ విసిరేశాడు. 

 

 

ఈ ఆహార ప్యాకె్ట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు.  వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను విసిరేశాడు. మంత్రి ఆహార ప్యాకెట్లను విసిరేయడాన్ని కొందరు వీడియో తీశారు.ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంత్రి తీరును నెటిజన్లు తప్పుబట్టారు. క్షమాపణ చెప్పాలని నెటిజన్లు మంత్రిని డిమాండ్ చేశారు.

Last Updated 9, Sep 2018, 1:34 PM IST