ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట జరిగింది.
న్యూఢిల్లీ:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం నాడు జరిగింది. సామాన్య భక్తులకు అయోధ్య రాముడిని దర్శించుకొనే వెసులుబాటును కల్పించింది.
అయోధ్య రామ మందిరంలోని రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అయోధ్యలోని శ్రీరాముడి ఎఐ (అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వీడియో) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడు చిరుమందహాసంతో చూస్తున్నట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
also read:నేను అత్యంత అదృష్టవంతుడిని: రామ్ లల్లా విగ్రహా ప్రాణప్రతిష్ట తర్వాత అరుణ్ యోగిరాజ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా ఆరుగురు అతిథులు రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్బంగా అయోధ్యలో హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారు.
I legit got goosebumps 🔥🔥🔥🔥
who did this? 😍🥰 pic.twitter.com/HZShK26gSj
నిన్న మధ్యాహ్నం 12:05 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరానికి చేరుకున్నారు. రామ మందిరంలోని గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రధాన కర్తగా మోడీ వ్యవహరించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తైన తర్వాత రామ్ లల్లా విగ్రహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాష్టాంగ ప్రమాణం చేశారు.
ప్రాణ ప్రతిష్ట ప్రధాన కార్యక్రమానికి ముందు ఇతర పూజలకు డాక్టర్ అనిల్ మిశ్రా ప్రధాన కర్గా వ్యవహరించారు. చివరి రోజున ప్రధాన కర్తగా ప్రధాన మంత్రి మోడీ వ్యవహరించారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు వేల మందికి నిర్వాహకులు ఆహ్వానం పంపారు. ప్రాణ ప్రతిష్ట పూర్తైన తర్వాత ఆలయ నిర్మాణంలో పాల్గొన్న సిబ్బందిపై పూలు చల్లి అభినందించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రాణప్రతిష్ట తర్వాత మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో రామ మందిరంలో తాను తయారు చేసిన విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగడంతో తాను అదృష్టవంతుడిగా పేర్కొన్నారు.