Ayodhya verdict: జడ్జీలకు చీఫ్ జస్టిస్ గోగోయ్ విందు

By telugu team  |  First Published Nov 9, 2019, 3:52 PM IST

అయోధ్య వివాదంపై చారిత్మక తీర్పు వెలువరించి, సమస్యకు పరిష్కారం చెప్పిన నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనం న్యాయమూర్తులకు విందు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ అనుకుంటున్నారు.


న్యూఢిల్లీ: రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం కేసులో చారిత్రాత్మకమైన తీర్పు చెప్పిన రాజ్యాంగ ధర్మాసం సభ్యులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విందు ఇవ్వనున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూ శతాబ్దాల తరబడి నలుగుతున్న రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం కేసును పరిష్కరించిన నేపథ్యంలో ఆయన తన బెంచీకి చెందిన మిగతా నలుగురు న్యాయమూర్తులకు మర్యాదపూర్వకంగా విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

న్యాయమూర్తులు ఎస్ఎ బోబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ లకు రంజన్ గోగోయ్ విందు ఇవ్వాలని అనుకుంటున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలోని తాజ్ మన్ సింగ్ హోటల్ లో ఆయన ఈ విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

undefined

Also Read: అయోధ్యపై సుప్రీం తీర్పు... అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి

దేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్న, అత్యంత సున్నితమైన కేసును పరిష్కరిస్తూ తీర్పు వెలువరించిన నేపథ్యంలో  తెర దించిన నేపథ్యంలో రంజన్ గోగోయ్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 

చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల సుప్రీం కోర్టు బెంచ్ ఏకగ్రీవంగా అయోధ్య తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. గత 70 ఏళ్లుగా నలుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తన తీర్పుతో తెర దించినట్లు భావిస్తున్నారు. 

Also Read: Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , తుది తీర్పు ముఖ్యాంశాలు ఇవే..

అయోద్యలోని వివాదాస్పద భూమిలో రాముడు జన్మించాడనే హిందువుల విశ్వాసం వివాదరహితమని రంజన్ గోగోయ్ తీర్పును చదువుతూ అన్నారు. విశ్వాసాలపై, నమ్మకాలపై విషయంపై నిర్ణయం తీసుకోలేమని, అయితే క్లెయిమ్ చేస్తున్నదానిపైనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 

రామ్ చబుత్ర, సీత రసోయిలను హిందువులు బ్రిటిష్ అక్రమణకు ముందు నుంచి పూజిస్తున్నారని చెప్పడానికి ఆధారాలున్నాయని ఆయన అన్నారు. 

click me!