Ayodhya Verdict ఈ తీర్పు అద్వానీకి అంకితం: బీజేపీ నేత ఉమాభారతి

By sivanagaprasad KodatiFirst Published Nov 9, 2019, 3:10 PM IST
Highlights

అయోధ్య స్థల వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్వాగతించారు. ఇది దైవసంబంధమైన తీర్పని వ్యాఖ్యానించారు

అయోధ్య స్థల వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్వాగతించారు. ఇది దైవసంబంధమైన తీర్పని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఆమె దివంగత విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్‌ను స్మరించుకున్నారు.

అలాగే ఈ చారిత్రక ఘట్టం కోసం ప్రాణాలను కోల్పోయిన వారందరికీ ఉమాభారతి నివాళులర్పించారు. అద్వానీజీ నాయకత్వంలో మనమంతా ఈ గొప్ప పనిలో భాగస్వాములం అయ్యామన్నారు. 

అయోధ్య వివాదంపై  సుప్రీంకోర్టు శనివారం నాడు తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి తమదేనని షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను  సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

బాబ్రీమసీదు కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో తెలియదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాదంపై  శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీలు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించారు.

Also read:Ayodhya Verdict:అయోధ్యపై సుప్రీం తీర్పు: సున్నీ వక్ప్ బోర్డు పిటిషన్ కొట్టివేత

మత గ్రంధాలను బట్టి కోర్టు తీర్పు ఉండదు నిర్మోహీ అఖాడా పిటిషన్‌ను కూడ కొట్టేసిన సుప్రీం కోర్టు. నిర్మోహి పిటిషన్‌కు కాలం చెల్లించదని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఖాళీ ప్రదేశం బాబ్రీ మసీదును కట్టలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.

పురావస్తు పరిశోధనలు చూస్తే 12వ, శతాబ్దంలోనే ప్రార్ధనా స్థలం ఉందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. అయితే అది దేవాలయం అని చెప్పేందుకు కూడ ఆధారాలు లేవని కూడ సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

దేవాలయాన్ని ధ్వంసం చేశారని చెప్పడానికి పురావస్తు ఆధారాల్లేవని సుప్రీంకోర్టు చెప్పింది. 12-16 శతాబ్దాల మధ్య అక్కడేముందో చెప్పేందుకు పురావస్తు శాఖ వద్ద ఆధారాల్లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.అయోధ్యను రాముడి జన్మభూమిగా హిందూవులు భావిస్తున్నారు. అయితే ఈ భావనలో ఎలాంటి వివాదానికి తావు లేదన్నారు.

Also Read:Ayodhya verdict: రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది.

శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది. 

కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేం‍ద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్‌ ‍ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు. 

click me!