పవన్ కళ్యాణ్ అయోధ్యకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ తిరుమల ప్రస్తావన చేశారు. ఇక పై నుంచి దక్షిణాది నుంచి కూడా ఎక్కువమంది భక్తులు అయోధ్యకు వస్తారని వివరించారు. 

Pawan Kalyan: ఈ రోజు అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అయోధ్యలో తిరుమల ప్రస్తావన తెచ్చారు.

అయోధ్యలో ఈ రోజు తనకు చాలా భావోద్వేగంగా గడిచిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాణ ప్రతిష్ట జరుగుతుండగా తన కళ్ల నుంచి కన్నీరు ఉబికి వచ్చిందని వివరించారు. అయోధ్యలో రాముడి మందిరం కోసం కొన్ని తరాలుగా, కొన్ని శతాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయని, ఇప్పుడు వారందరికీ ఆశయం నెరవేరిందని తెలిపారు. ఇది ఒక రకంగా దేశాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. దేశాన్ని ఏకం చేస్తుందని పేర్కొన్నారు.

Also Read : LK Advani: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎల్‌కే అడ్వాణీ గైర్హాజరు.. కారణం ఏమిటంటే?

సాధారణంగా తాము రాముడు, బాలాజీ కోసం తిరుమలకు వెళ్లుతామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక పై రాముడి కోసం అయోధ్యకు వస్తారని వివరించారు. ముఖ్యంగా దక్షిణాది నుంచి అయోధ్యకు ఎక్కువ మంది వస్తారని పేర్కొన్నారు. తనకు అయోధ్య కోసం ఏదైనా చేయాలని ఉన్నదని, రానున్న రోజుల్లో ఏదో ఒకటి చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.

Scroll to load tweet…

ఈ రోజు అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ క్రతువులో ప్రముఖంగా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు వచ్చారు. కాగా, విపక్ష పార్టీలు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి.