అయోధ్య రామ మందిరం: ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటీ?

By narsimha lode  |  First Published Jan 20, 2024, 11:34 AM IST


అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల  22న జరగనుంది. రాముడి విగ్రహనికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 


న్యూఢిల్లీ:  ఈ నెల  22న అయోధ్యలో  రామ మందిర ప్రారంభోత్సవ 
కార్యక్రమాన్ని  శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈ కార్యక్రమానికి ఏడు వేల మందిని  ఆహ్వానించింది. 

అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.ఇప్పటికే  ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయోధ్య రామాలయంలోని గర్బగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు.

Latest Videos

ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటీ?

దేవాలయాల్లో విగ్రహ రూపంలో ఉన్న దేవుళ్లను ఆరాధిస్తుంటాం. ప్రాణ ప్రతిష్ట తర్వాత ఆ విగ్రహలు ప్రాణంతో ఉన్న దేవుడితో సమానంగా  భావిస్తారు. అందుకే ప్రాణ ప్రతిష్ట చేస్తారు.ఒక్కసారి విగ్రహనికి ప్రాణ ప్రతిష్ట చేస్తే  ఏళ్ల తరబడి ఆ విగ్రహం ప్రాణం ఉన్న దేవుడితో సమానమని చెబుతుంటారు. 

విగ్రహనికి  వేద మంత్రాల ద్వారా ప్రాణ శక్తిని అందిస్తారని  పురాణాలు చెబుతున్నాయి.  ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత  ఆ విగ్రహల్లో ఉన్న దేవుడు మళ్లీ జన్మించినట్టేనని చెబుతారు. 

ఏదైనా విగ్రహనికి  ప్రాణ ప్రతిష్ట చేయడానికి సరైన ముహుర్తాన్ని చూస్తారు.ఈ ముహుర్తం మేరకు  ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్టకు ముందు చేయాల్సిన  శాస్త్రోక్తమైన కార్యక్రాలు చేయాల్సి ఉంటుంది.  ప్రాణ ప్రతిష్ట కంటే ముందే మూర్తి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని  నిర్వహిస్తారు.   తొలుత తాము నిర్ధేశించుకున్న స్థలంలో విగ్రహన్ని ఏర్పాటు చేస్తారు.  దీన్నే మూర్తి ప్రతిష్టాపనగా పిలుస్తారు.  అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో  రామ్ లల్లా విగ్రహన్ని నిన్న  ప్రతిష్టించారు.   రామ్ లల్లా విగ్రహనికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో  రెండు మూడు రోజులుగా  ప్రత్యేకంగా పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు.

also read:అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట: వీవీఐపీల తాకిడి, విమానాలకు పార్కింగ్ సమస్య?

ఎంత అందమైన విగ్రహన్ని ఏర్పాటు చేసినా ప్రాణ ప్రతిష్ట చేయకపోతే ఆ విగ్రహం వల్ల ఉపయోగం ఉండదని  పండితులు చెబుతున్నారు.  విగ్రహనికి ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాతే  దానికి ప్రయోజనం కలుగుతుందని  పండితులు చెబుతున్నారు. ఈ మేరకు సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాల్లోని పొందుపర్చిన అంశాలను ప్రస్తావిస్తున్నారు.అయోధ్యలోని  రామమందిరంలోని రామ్ లల్లా విగ్రహానికి  ఈ నెల 22న  ప్రాణ ప్రతిష్ట జరగనుంది. 


ప్రాణ ప్రతిష్ట వేడుక ఎలా నిర్వహిస్తారు?

ప్రాణ ప్రతిష్టకు ముందు నీరు, ధాన్యం మిశ్రమంలో  విగ్రహన్ని  నిమజ్జనం చేస్తారు.  ఇది పవిత్రీకరణ కాలాన్ని సూచిస్తుంది.ఆలయం వద్దకు వచ్చిన తర్వాత విగ్రహన్ని పాలతో ఉత్సవ స్నానం చేయిస్తారు.  విగ్రహన్ని తూర్పు ముఖంగా  ఉంచుతారు.  తూర్పు ముఖంగా ఉండడం సానుకూల శక్తిని ఆహ్వానిస్తుందని నమ్ముతారు. ఇది ఉదయించే సూర్యుడి దిశతో సమానంగా ఉంటుంది.

also read:అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట: జనవరి 22న సెలవులు లేదా హాఫ్ డే సెలవు ప్రకటించిన రాష్ట్రాలివే...

విగ్రహన్ని నిర్ధేశించిన స్థానంలో ఉంచిన తర్వాత పూజారాలు, వేద మంత్రాల మధ్య  పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.వేద మంత్రాలతో  ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. దశల వారీగా అన్ని కార్యక్రమాలు పూర్తైన తర్వాత  ప్రాణ ప్రతిష్ట పూర్తి కానుంది. ఒక్కసారి ప్రాణ ప్రతిష్ట జరిగితే  ఏళ్ల తరబడి  ఆ విగ్రహంలో  దేవుడు జన్మించి ఉంటాడని హిందూ సంప్రదాయం చెబుతుంది.
 

click me!