అయోధ్య లైవ్ ఫొటోలు, వీడియోలంటూ లింక్ లు.. ఓపెన్ చేశారంటే అంతే...

By SumaBala BukkaFirst Published Jan 20, 2024, 10:11 AM IST
Highlights

ఈ లింకులను ఓపెన్ చేయగానే ఫోన్ హ్యాకింగ్ కి గురవుతుంది. దీంతో  హ్యాకర్లు బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు. 

అయోధ్య : దేశమంతటా ఇప్పుడు ట్రెండింగ్ అయోధ్య. సోమవారం నాడు జరిగే రామాలయం ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భక్తుల ఈ ఆసక్తిని, ఉత్సాహాన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయోధ్య పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయోధ్య లైవ్ ఫోటోలు, వీడియోలు అంటూ మొబైల్స్ కు లింకులు పంపుతున్నారు.

ఈ లింకులను ఓపెన్ చేయగానే ఫోన్ హ్యాకింగ్ కి గురవుతుంది. దీంతో  హ్యాకర్లు బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి లింకులను ఓపెన్ చేయవద్దని సైబర్ క్రైం పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. 

Latest Videos

ఇదిలా ఉండగా, అయోధ్య రామాలయానికి సంబంధించిన రోజుకో స్కాం బయటపడుతుంది. తాజాగా లడ్డూల అమ్మకానికి సంబంధించి అమెజాన్ కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. సాధారణ లడ్డూలనే అయోధ్య లడ్డూలంటూ అమెజాన్ అమ్ముతుందని కేంద్రం దృష్టికి వచ్చింది. దీనిమీద వారంలోపు వివరణ ఇవ్వాలని అమెజాన్ కు నోటీసులు పంపించింది. 

అయోధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. వెయ్యి సీసీ కెమెరాలతో నిఘా...

జనవరి 16వ తేదీ మంగళవారం నుంచి అయోధ్యలో పవిత్రాభిషేకం ప్రారంభమైంది. ప్రాణ్-ప్రతిష్ఠ జనవరి 16 నుంచి 22 వరకు వివిధ దశల్లో నిర్వహిస్తారు.

భగవాన్ శ్రీ రాంలాలా ప్రాణ-ప్రతిష్ఠా యోగానికి అనుకూలమైన సమయం పౌష్ శుక్ల కూర్మ ద్వాదశి, విక్రమ సంవత్ 2080, అంటే సోమవారం, జనవరి 22, 2024. అన్ని సాంప్రదాయాలను అనుసరించి, జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో పవిత్రోత్సవం జరగనుంది.

జనవరి 19న సాయంత్రం ధాన్యాధివాసాలు, జనవరి 20న ఉదయం సుగర్ధివాసాలు, జనవరి 20న సాయంత్రం ఫలాధివాసాలు, 20న సాయంత్రం పుష్పాధివాసాలు, 21న ఉదయం మధ్యాధివాసులు, 21వ తేదీ సాయంత్రం శయ్యదివాసాలు ఉంటాయి.

click me!