Breaking : వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట .. మోడీకి ఆహ్వానం

By Siva Kodati  |  First Published Oct 25, 2023, 7:30 PM IST

జనవరి 22, 2024న అయోధ్య రామమందిర్ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించారు. రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించడంతో వచ్చే ఏడాది జనవరి 22న ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.


కోట్లాది మంది హిందువులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల సాక్ష్యాత్కరించనుంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఎప్పుడెప్పుడు రాములోరిని అయోధ్యలో దర్శించుకుందామా అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర్ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించారు. రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించడంతో వచ్చే ఏడాది జనవరి 22న ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించేందుకు రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ప్రతినిధి బృందం బుధవారం ప్రధాని మోడీని కలిసింది. వారి ఆహ్వానాన్ని నరేంద్ర మోడీ మన్నించారు. ఈ ప్రతినిధి బృందంలో చంపత్ రాయ్, ఉడిపికి చెందిన మాధవాచార్య, స్వామి గోవిందదేవ్ గిరి, నృపేంద్ర మిశ్రా వున్నారు. 

కాగా.. అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 24 మధ్య జరిగే అవకాశం వుందని ఏషియా నెట్ ముందే నివేదించింది. ఏషియానెట్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజేశ్ కల్రా ప్రత్యేకంగా చేసిన ఇంటర్వ్యూలో ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన గురించి వివరించిన సంగతి తెలిసిందే. జనవరి 14వ తేదీ నుంచి 24వ తేదీ నడుమ ఈ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని ఏషియానెట్ న్యూస్‌కు నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. 

Latest Videos

ALso Read: జనవరి 22న అయోధ్య రామమందిరంలో ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం! హాజరుకానున్న ప్రధాని మోడీ

‘ప్రార్థనలు, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు 2024 జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఈ పూజలు, కార్యక్రమాలు అదే నెల 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించాం. అటు వైపు నుంచి ఇంకా సమాధానం రాలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించిన తేదీలో తుది ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దేవుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం. మరుసటి రోజు నుంచి భక్తులు దర్శనానికి రావొచ్చు. ఆ రాముడి విగ్రహం ముందే ప్రస్తుత భగవంతుడి విగ్రహాన్నీ ఉంచుతాం’ అని అప్పుడు నృపేంద్ర మిశ్రా ఏషియానెట్ న్యూస్‌కు వివరించారు.

click me!