అయోధ్య రామ మందిరం: తప్పుడు సమాచారం ఇవ్వొద్దని మీడియాకు ప్రభుత్వం వార్నింగ్

By narsimha lode  |  First Published Jan 20, 2024, 5:30 PM IST

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి దేశం మొత్తం ఎదురు చూస్తుంది. 
 


న్యూఢిల్లీ: ఈ నెల  22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమానికి  ఇంకా  48 గంటలు కూడ లేదు.  ఈ ప్రత్యేకమైన కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో   సోషల్ మీడియా, మీడియాల్లో రామ మందిరానికి సంబంధించిన ఈవెంట్ తారుమారు చేసి ప్రచారం చేస్తున్నారనే విషయమై విమర్శలు వస్తున్నాయి. దీంతో  కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై వార్నింగ్ ఇచ్చింది.  రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి తప్పుడు, నిరాధారమైన ప్రచారం చేస్తే సహించబోమని మీడియా సంస్థలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. 

Latest Videos


రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి తప్పుడు ప్రచారం మానుకోవాలని మీడియా సంస్థలను, సోషల్ మీడియా సంస్థలను కేంద్రం కోరింది. 

ఈ నెల  22న రామ మందిర ప్రారంభోత్సవానికి దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన  సుమారు  8 వేల మంది హాజరు కానున్నారు.  ఇందులో  రాజకీయ నేతలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడ ఉన్నారు.  సినీ ,పారిశ్రామిక, అధికార వర్గాలు కూడ ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు కూడ ఆహ్వానాలు వెళ్లాయి.  అయితే ఈ ఆహ్వానాలను ఈ రెండు పార్టీలు తిరస్కరించాయి.

 

click me!