లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కొత్త నినాదాన్ని ఖరారు చేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యంలో జరిగిన సమావేశంలో ఈ నినాదాన్ని ఎంచుకున్నారు.
JP Nadda: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యంలో ఈ రోజు కీలక సమావేశం జరిగింది. రానున్న లోక్ సభ ఎన్నికలు, అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాల వ్యూహ రచనపై చర్చించారు. ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలకు అవలంభించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. తీసుకోవాల్సిన స్లోగన్ పైనా కసరత్తు చేశారు. చివరకు ఈ సమావేశంలో పార్టీ ఒక కొత్త నినాదాన్ని ఎంపిక చేసుకుంది.
‘తీస్రీ బార్ మోడీ సర్కార్, అబ్ కీ బార్ 400 పార్(మూడోసారి కూడా మోడీ ప్రభుత్వం. ఇప్పుడు 400కుపైగా సీట్లు)’ అనే స్లోగన్‌ను నిర్ణక్ష్ించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఈ నినాదాన్నే చేయనుంది. పార్లమెంటు ఎన్నికల్లో 400కుపైగా సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
undefined
Also Read: ఓటుకు నోటు కేసు కొనసాగిస్తా.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్కే
అలాగే.. రాష్ట్రం, లోక్ సభ, అసెంబ్లీ స్థాయిల్లో కన్వీనర్లు, కో కన్వీనర్లను నిర్ణయించనున్నారు.
కేంద్రమంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, సీఎం హిమంత బిశ్వ శర్మ, జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్, జనరల్ సెక్రెటరీ సునీల్ బన్సల్ సహా పలువురు నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది.