హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతం.. ఇద్దరు బీఆర్వో కార్మికులు మృతి.. మరొకరు గల్లంతు

By Asianet NewsFirst Published Feb 6, 2023, 9:05 AM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని లాహౌల్-స్పితి జిల్లాలో హిమపాతం సంభవించడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో కార్మికుడు తప్పిపోయాడు. అతడిని కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం లాహౌల్-స్పితి గిరిజన జిల్లాలో హిమపాతం కొనసాగుతోంది. ముగ్గురు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ వో) కార్మికులు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో లాహౌల్ సబ్‌డివిజన్‌లోని సరిహద్దు ప్రాంతమైన చికా సమీపంలో హిమపాతం కింద సమాధి అయ్యారు. ఇద్దరు కూలీల మృతదేహాలు లభ్యం కాగా, మూడో వ్యక్తి ఆచూకీ లభించలేదు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్  యంత్రాలు, కార్మికులు దర్చా-శింకుల రహదారిని పునరుద్ధరిస్తుండగా ప్రమాదం జరిగింది.

తప్పుడు ఇంజెక్షన్ తో మహిళ మృతి.. వైద్యార్హత లేకుండా క్లినిక్ నడుపుతున్న వ్యక్తి అరెస్ట్..

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, జిల్లా విపత్తు నిర్వహణ, పోలీసులు, రెస్క్యూ టీం సాయంత్రం 6 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు, పొగ మంచు కారణంగా తక్కువ దృశ్యమానత నెలకొనడం వల్ల గల్లంతైన మరో వ్యక్తిని కనుగొనడానికి గంటల తరబడి రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ నిర్వహంచారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆపరేషన్ నిలిపివేశారు. మృతులను రామ్ బుద్ధ (19), రాకేష్‌గా గుర్తించగా, గల్లంతైన వ్యక్తిని పసాంగ్ షెరింగ్ లామాగా గుర్తించారు.

అమెరికా వెళ్లే భారతీయులకు శుభవార్త.. వీసా ఇక త్వరగా..

గల్లంతైన వ్యక్తి కోసం సోమవారం నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. ‘‘నిన్న మధ్యాహ్నం 3 గంటలకు లాహౌల్, స్పితి జిల్లాలోని చికా సమీపంలో హిమపాతంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒకరు తప్పిపోయారు. తక్కువ ఉష్ణోగ్రత, దృశ్యమానత కారణంగా రెస్క్యూ ప్రయత్నాలు నిలిపివేయబడ్డాయి. ఇది రేపు మళ్లీ ప్రారంభమవుతుంది.’’ అని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకటించంది. 

click me!