హెల్మెట్ పెట్టుకుని వచ్చి.. పట్టపగలు, నడిరోడ్డులో భార్యను హత్య చేసిన భర్త..

By SumaBala BukkaFirst Published Feb 6, 2023, 8:28 AM IST
Highlights

ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. అదీ పెళ్లైన ఆరునెలలకే ఈ ఘాతుకానికి తెగబడ్డాడు.

తమిళనాడు : ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు ప్రేమోన్మాదులు..తనని విడిచి వెళ్లిందని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని నడిరోడ్డులో అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ భర్త. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో పట్టపగలు చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే.. తనను ఎవరు గుర్తుపట్టకుండా హెల్మెట్ పెట్టుకుని వచ్చి మరి ఆమెను హత్య చేశాడు. ఆ తరువాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..  మధురైలోని సౌత్ గేటు సప్పాని కోవిల్ వీధికి చెందిన మీనాక్షి సుందరం చిన్న కుమార్తె వర్ష (19), ఆమె పళని(25) అనే వ్యక్తిని ప్రేమించింది. ఆరు నెలల క్రితం వీరిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి.  దీంతో వర్ష నెలన్నర రోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఇంటికి తిరిగి రావాలని  భర్త పళని ఎన్నిసార్లు అడిగినా ఆమె ఒప్పుకోలేదు.  

తప్పుడు ఇంజెక్షన్ తో మహిళ మృతి.. వైద్యార్హత లేకుండా క్లినిక్ నడుపుతున్న వ్యక్తి అరెస్ట్..

దీంతో నేరుగా ఆమెను కలిసి తీసుకువెళ్లడానికి శుక్రవారం మధ్యాహ్నం పళని వర్ష ఉంటున్న ప్రాంతానికి వచ్చాడు. వర్ష సప్పాని శుక్రవారం మధ్యాహ్నం కోవిల్ వీధిలో ఓ దుకాణానికి వెళ్లి తనకు కావలసినవి కొనుక్కొని ఇంటికి వెళుతుంది. ఈ సమయంలో పళని  హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద అక్కడికి వచ్చాడు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే,  వర్ష.. పళనితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అతను చెప్పేది ఏదీ వినలేదు. దీంతో కోపానికి వచ్చిన పళని  తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మీద దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బైక్ మీద  పారిపోయాడు. 

ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు వర్షను వెంటనే మధురై ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఆస్పత్రికి వెళ్లేసరికే వర్ష మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. దీనిమీద సౌత్ గేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా  నిందితుడు పళని అని గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే పళని కీరైత్తురై పోలీస్ స్టేషన్లో స్వయంగా లొంగిపోయాడు. 

click me!