ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సాతాను శక్తుల ప్రయ‌త్నం : హేమంత్ సోరెన్

Published : Aug 27, 2022, 08:46 AM IST
ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సాతాను శక్తుల ప్రయ‌త్నం : హేమంత్ సోరెన్

సారాంశం

ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని తొలగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. రాజకీయంగా తమతో పోటీ పడలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల‌ను అస్థిరపరిచేందుకు సాతాను శక్తులు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని జేఎంఎం నాయ‌కుడు, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయ‌న‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫారసు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం లతేహార్ లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు. 

భార్యపై ప్రేమ.. ఇంట్లోనే పూడ్చిపెట్టి, అంత్యక్రియలు.. భయాందోళనల్లో స్థానికులు.. చివరికి..

తాజా పరిణామాల‌తో తాను కలత చెందలేదని పేర్కొన్న సోరెన్, తన ప్రత్యర్థులు కాకుండా ప్రజలతో రాష్ట్రాన్ని పాలించే అధికారం తనకు అందింద‌ని అన్నారు. ‘‘ రాజకీయంగా మాతో పోటీ పడలేక, మన ప్రత్యర్థులు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఈడీ, సీబీఐ, లోక్ పాల్, ఆదాయపన్ను శాఖలను వారు ఉపయోగిస్తున్నారు. కానీ మేము ఆ విష‌యంలో ఆందోళన చెందడం లేదు. త‌మ‌ని పాలించాల‌ని ప్ర‌జలు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రత్యర్థులు ఇవ్వ‌లేదు. ’’ అని ఆయ‌న అన్నారు.

‘‘ రెండేళ్లుగా రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితి నెలకొంది. ఇప్పుడే మ‌నం మన అభివృద్ధి వేగాన్ని వేగవ౦త౦ చేస్తున్న స‌మ‌యంలో సాతాను శక్తులు మన వేగానికి అడ్డుకట్ట వేయడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అలాంటి శక్తులు ఏదైనా చేయగలవు. కానీ నా ప్రజల కోసం పని చేయకుండా నన్ను ఎప్పటికీ ఆపలేవు ’’ అని సోరెన్ అన్నారు.

జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్ల ‘గుప్త’ విరాళాలు.. ప్రాంతీయ పార్టీల్లో వైసీపీకే అధికం.. తేల్చిన ఏడీఆర్..

‘‘ నేను ఒక గిరిజనుడి కొడుకును. ఒక గిరిజనుడి డీఎన్ఏలో భయం లేదు. నా శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు నేను పోరాడుతాను ’’ అని సీఎం అన్నారు. జార్ఖండ్ లో బయటి శక్తుల ముఠా క్రియాశీలకంగా ఉందని సోరెన్ బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ఈ ముఠా కృషి చేస్తోందని తెలిపారు. ‘‘ 2019లో వారిని తొలగించినప్పుడు, కుట్రదారులు దానిని సహించలేకపోయారు. మేము ఇక్కడ ఉంటే వారికి అది క్లిష్ట స‌మ‌యం. మేము ఆకలితో లేము. కేవలం ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి మాత్రమే మనం రాజ్యాంగ వ్యవస్థ కింద ఉన్నాం ’’ అని ఆయన అన్నారు.

మ‌రోసారి ప్రధాని మోదీయే నెంబర్. 1 .. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయ‌కుడ‌యనే.. ఆ తర్వాతే ఇంకెవరైనా ..

కాగా.. తనుకు తానుగా మైనింగ్ లీజును పొడ‌గించుకొని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించార‌ని, సోరెన్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిష‌న్ పై ఎన్నికల సంఘం గురువారం గవర్నర్ రమేష్ బైస్ త‌ను త‌న సిఫారసును పంపింది. అయితే శుక్ర‌వారం సాయంత్రం గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేశారు. ఇక దీనిపై సోరెన్ ఎలా స్పందిస్తార‌నేది, ఆయ‌న త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఏంట‌నేది తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం