పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు

Published : Jun 27, 2023, 11:04 AM IST
పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు

సారాంశం

పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు పెరిగిపోతున్నాయి. గడిచిన మూడు నెలల్లోనే నలుగురిని ముష్కరులు కాల్చి చంపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ విషయంలో విచారణ జరిపి, నివేదిక అందజేయాలని ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. 

పాకిస్థాన్ లో సిక్కు కమ్యూనిటీ సభ్యులపై జరుగుతున్న దాడులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్త కు సమన్లు జారీ చేసింది. సిక్కులపై పెరుగుతున్న దాడులపై వివరణ ఇవ్వాలని కోరింది. సిక్కు కమ్యూనిటీపై దాడుల కేసును చిత్తశుద్ధితో దర్యాప్తు చేసి, దాని నివేదికను త్వరితగతిన అందజేయాలని పాక్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కోరింది. అవసరమైతే సరిహద్దు వెంబడి దాడులు చేస్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది.

సీఎంను విమర్శిస్తున్నా పవన్ కల్యాణ్ పై ఆ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు నో కామెంట్స్..కారణమదేనా ?

పాకిస్థాన్ లో సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ‘జీ న్యూస్’ కథనం పేర్కొంది. ఇలాంటి ఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మతపరమైన హింసపై నిరంతరం భయపడుతూ జీవిస్తున్న తమ మైనారిటీల భద్రతకు పాకిస్థాన్ భరోసా కల్పించాలని డిమాండ్ చేసింది. సిక్కు కమ్యూనిటీపై 2023 ఏప్రిల్-జూన్ మధ్య నాలుగు దాడులు జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించింది. 

గత శనివారం గుర్తుతెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో సిక్కు కమ్యూనిటీ సభ్యుడిని కాల్చి చంపినట్లు పాకిస్థాన్ కు చెందిన ‘ది న్యూస్ ఇంటర్నేషనల్’ తెలిపింది. ఆయన మూడు నెలల్లో చనిపోయిన నాలుగో వ్యక్తి. ఈ ఘటన కక్షల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుడిని 34 ఏళ్ల మన్మోహన్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఆయన ఎప్పటిలాగే శనివారం సాయంత్రం ఆటోలో ఇంటికి వెళ్తుండగా కక్షల్ లోని గుల్దారా సమీపంలో గుర్తుతెలియని సాయుధులు ఆయనపై కాల్పులు జరిపారని రాజధాని నగర పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాంలో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం.. పోలీసుకు గాయాలు

సీనియర్ పోలీసు అధికారులు, దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను సేకరించాయి. నిందితులను పట్టుకునేందుకు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే శుక్రవారం కూడా ప్రావిన్స్ రాజధానిలోని డబ్గారి ప్రాంతంలో మరో సిక్కు వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఆయనను మఖాన్ సింగ్ కుమారుడు తార్లూగ్ సింగ్ గా గుర్తించారు. ఈ కాల్పుల్లో ఆయన కాలుకి గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి.. సర్పంచ్ నుంచి రాజ్యసభ వరకు సాగిన రాజకీయ ప్రస్థానం..

మే నెలలో తూర్పు నగరమైన లాహోర్ లో దుండగులు సర్దార్ సింగ్ ను కాల్చి చంపారు. 63 ఏళ్ల సింగ్ కు తలకు బుల్లెట్ తగలడంతో ఆయన చనిపోయారు. సిక్కు కమ్యూనిటీపై సభ్యుడిపై ఇది మూడవ దాడి. ఈ దాడిలో అతడి బాడీ గార్డ్ కూడా గాయపడినట్లు పోలీసు అధికారి అసద్ అబ్బాస్ తెలిపినట్లు ‘పాకిస్థాన్ టుడే’ తెలిపింది. ఏప్రిల్ లో పెషావర్ లో దయాల్ సింగ్ ను ముష్కరులు కాల్చి చంపారు.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu