
మద్యం వ్యసనం ఎన్నో అనర్ధాలకు దారి తీస్తోంది. తన, మన అనే తేడా లేకుండా దాడులకు పురిగొల్పుతోంది. మద్యం మత్తులో ఎన్నో అరాచకాలకు ఒడిగడుతున్నాడు. తాగేందుకు డబ్బుల కోసం ఏ పని చేసేందుకు అయినా వెనకాడటం లేదు. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు అప్పు ఇవ్వలేదని ఓ మహిళను పొరుగింటి యువకుడు హత్య చేశాడు.
బీహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 30కి పెరిగిన మృతుల సంఖ్య.. ఇద్దరు పోలీసుల సస్పెండ్..
వివరాలు ఇలా ఉన్నాయి. థానే జిల్లా డోంబివిలీ ప్రాంతంలో 44 ఏళ్ల వైశాలి మస్దూద్ అనే మహిళ నివసిస్తోంది. ఆమె నివసించే ఇంటి సమీపంలో నిందితుడు నివసిస్తున్నాడు. అయితే అతడు తాగుడికి బానిసయ్యాడు. తరచూగా వైశాలిని, ఆమె కుమారుడిని మద్యం తాగేందుకు డబ్బులు అడిగేవాడు. అప్పు తీసుకునేవాడు.
అయితే అతడి తీరుతో తల్లీ కుమారులకు విసిగెత్తిపోయింది. ఇక నుంచి నిందితుడికి డబ్బులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం అతడు వైశాలి దగ్గరకు వచ్చాడు. మద్యం తాగేందుకు డబ్బులు అప్పు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతడికి కోపం వచ్చింది. ఆక్రోశంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
"జై శ్రీరామ్ కాదు.. జై సియారామ్..." బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్ లపై రాహుల్ ఫైర్
ఇలాంటి గతేడాది జూలైలో తమిళనాడులో జరిగింది. సిగరెట్ అప్పుగా ఇవ్వన్నందుకు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మధురై జిల్లాలోని సక్కిమంగళం సమీపంలోని సమత్తువపురం గ్రామంలో వినోద్ పాన్ అనే వ్యక్తి షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే జూలై 20వ తేదీన ఆ ప్రాంతానికి చెందిన అరుణ్ పాండి, కార్తీక్, జ్యోతిమణి దుకాణం వద్దకు వచ్చారు.
ద్రవ్యోల్బణం కంట్రోల్ లోనే ఉంది.. ప్రభుత్వం దానిని మరింత తగ్గిస్తుంది - నిర్మలా సీతారామన్
సిగరెట్ ఇవ్వాలని వినోద్ ను కోరారు. కానీ డబ్బులిస్తేనే సిగరెట్ ఇస్తానని అతడు బదులిచ్చాడు. అప్పుగానైతే సిగరేట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు నిందితులు వినోద్ పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు మదురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.