దారుణం.. ఆరేళ్ల చిన్నారిని ఢీకొట్టిన టీఎంసీ ఎంపీ కారు.. పశ్చిమ బెంగాల్ లో ఘటన..

Published : Nov 17, 2022, 01:56 PM IST
దారుణం.. ఆరేళ్ల చిన్నారిని ఢీకొట్టిన టీఎంసీ ఎంపీ కారు.. పశ్చిమ బెంగాల్ లో ఘటన..

సారాంశం

పశ్చిమ బెంగాల్ లో దారుణం చోటు చేసుకుంది. టీఎంసీ ఎంపీకి చెందిన కారు కింద పడి ఓ ఆరేళ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అబూ తాహెర్ ఖాన్ కారు ఆరేళ్ల చిన్నారిని ఢీ కొట్టింది. దీంతో ఆ బాలిక చనిపోయింది. ముర్షిదాబాద్ జిల్లా నౌడా ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. 

శ్రద్ధా వాకర్ హత్య కేసు : పోలీసులకు సవాల్ గా మారిన సాక్ష్యాల సేకరణ..

వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీ అబూ తాహెర్ ఖాన్ కు చెందిన ఎస్ యూవీ కారు బుధవారం ముర్షిదాబాద్‌లోని నౌడాలో ప్రయాణిస్తోంది. అయితే ఆ సమయంలో ఓ చిన్నారి ఆ కారు ముందు నుంచి పరిగెత్తింది. అయితే డ్రైవర్ కారును అదుపు చేయలేకపోయాడు. ఆ చిన్నారిని కొన్ని మీటర్ల వరకు అలాగే లాక్కెళ్లాడు. అనంతరం కారును ఆపారు.

పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కండి; కమల్ హాసన్

తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారిని ఎంపీ అదే కారులో చిన్నారిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఆ బాలికను హాస్పిటల్ కు తీసుకెళ్లేలోపే మార్గమధ్యంలో పరిస్థితి విషమించి మరణించింది.  ఈ ప్రమాదంపై ముర్షిదాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ కె శబరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన మధ్యాహ్నం 2-2.30 గంటల మధ్య జరిగింది. ప్రమాదానికి గురైన పాప చనిపోయింది. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, డ్రైవర్ ను అరెస్టు చేశాం. ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమన చర్యలు తీసుకుంటాం ’’ అని తెలిపారు. 

స్మగర్లపై కొరడా.. కోటి రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం..

కాగా.. ఈ ఘటనపై టీఎంసీ ఎంపీ అబూ తాహెర్ ఖాన్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన చిన్నారి అకస్మాత్తుగా రోడ్డుపై పరిగెత్తిందని తెలిపారు. అయితే ఆ బాలిక తల్లి దీనిని గమనించలేదని అన్నారు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఇది దృష్టకర సంఘటన అని, తాను బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu