ఎప్పటిలాగే ఢిల్లీ వీధుల్లో ట్యాక్సీ నడుపుతున్న అతడిపై దొంగల ముఠా దాడి చేసింది. అతడి నుంచి ట్యాక్సీ చోరీ చేసింది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన డ్రైవర్ పై దొంగలు దాడి చేశారు. అనంతరం రోడ్డుపై అతడిని ఈడ్చుకెళ్లారు. గాయాలతో బాధితుడు చనిపోయాడు.
దేశ రాజధానిలో దారుణం జరిగింది. ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తిపై దొంగలు దారుణంగా ప్రవర్తించారు. అతడిని అడ్డగించి ట్యాక్సీని చోరీ చేశారు. దీనిని నిలువరించేందుకు ప్రయత్నించిన డ్రైవర్ ను.. రోడ్డుపై 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లారు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలతో మరణించాడు. ఇది స్థానికంగా కలకలం రేకెత్తించింది.
101 ఏళ్ల కేరళ వృద్ధ విద్యార్థిని కార్త్యాయని అమ్మ కన్నుమూత.. తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన సీఎం
వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల బిజేంద్ర ఓ ట్యాక్సీ డ్రైవర్. ప్రతీ రోజూ ట్యాక్సీ నడపడం వల్ల వచ్చిన ఆయన జీవనాధారం. అయితే ఆయన ఎప్పటిలాగే మంగళవారం కూడా ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ట్యాక్సీ నడుపుతున్నాడు. అయితే వాహనం వసంత్ కుంజ్ నార్త్ లోని ఎన్ హెచ్ -8 సర్వీస్ రోడ్డు సమీపంలో రాత్రి 11 గంటల ప్రాంతానికి చేరుకుంది.
ఒడిశా రైలు ప్రమాదం : క్లెయిమ్ చేయని మృతదేహాలకు అంత్యక్రియలు.. గడ్డకట్టడంతో ఆలస్యమైన దహన సంస్కారాలు..
ఇదే సమయంలో దొంగల బృందం అతని వాహనాన్ని అడ్డగించింది. ట్యాక్సీని దొంగలించడానికి ప్రయత్నించింది. దీనిని బిజేంద్ర అడ్డుకున్నాడు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేసి అతడిపై దాడి చేశారు. అనంతరం రోడ్డుపై పడుకోబెట్టి దాదాపు 200 మీటర్ల వరకు కారుతోనే ఈడ్చుకెళ్లారు. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో మరణించాడు.
గాజాను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. ఇరువైపులా 3,000 దాటిన మరణాల సంఖ్య..
ఎన్ హెచ్ -8 సర్వీస్ రోడ్డు సమీపంలో రాత్రి 11.30 గంటలకు ఓ వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు ఢిల్లీ పోలీసుకు ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.