దారుణం.. కిడ్నాప్ అయిన బాలిక బీచ్ లో మృతదేహంగా లభ్యం.. అత్యాచారం చేసి, చంపేశారని తల్లిదండ్రుల అనుమానం..

By team teluguFirst Published Nov 29, 2022, 11:55 AM IST
Highlights

ఒడిశాలో దారుణం వెలుగులోకి వచ్చింది. శరీరంపై గాయలతో ఉన్న ఓ యువతి మృతదేహం బీచ్ లో లభించింది. అయితే ఆమె కొన్ని రోజుల కిందట మధ్యప్రదేశ్ లో కిడ్నాప్ కు గురయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మధ్యప్రదేశ్ లో కొన్ని రోజుల కిందట తప్పిపోయిన ఓ యువతి ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో శవమై కనిపించింది. అయితే యువతిపై అత్యాచారం జరిపి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక మృతదేహం గుర్తు పట్టలేకుండా తయారైంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

దారుణం : సహాయం కోరిన గ్యాంగ్ రేప్ బాధితురాలిపై.. ప్రధానోపాధ్యాయుడి అత్యాచారం..

వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి నవంబర్ 23వ తేదీన హోటల్ గది నుంచి బయటకు వచ్చింది. అయితే ఆ తరువాత కనిపించకుండా పోయింది. దీనిపై అదే రోజు ఆమె కుటుంబ సభ్యులు సీబీచ్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే నవంబర్ 26వ తేదీన ఒడిశాలోని బీచ్ లో ఆ బాలిక శవమై కనిపించింది. ఆమె మృతదేహం స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

మితిమీరుతోన్న పాక్ ఉగ్రచర్యలు.. మరోసారి పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం.. కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌

ఆమె చెవిపోగులు, బంగారు ముక్కు పిన్, చేతిలో రెడ్ బ్యాండ్, ఆమె చీలమండపై నల్లటి బ్యాండ్ ఉండటం వల్ల తండ్రి తన కూతురును గుర్తించారు. వార్తా సంస్థ ‘పీటీఐ’ విడుదల చేసిన ఫొటోలో బాధితురాలి శరీరం మొత్తం ఉబ్బిపోయి కనిపిస్తోంది. అందులో ఆమె ఒక వేలు కూడా కనిపించడం లేదు. అక్కడక్కడ కత్తి ఘాట్లు కూడా ఉన్నాయి. ఆ యువతి ముఖం పూర్తిగా నల్లబడిందని, బహుశా యాసిడ్ వంటి రసాయనాల వల్ల ఆమె వేళ్లు ఛిద్రమై ఉంటాయని పూరీ పోలీసులు తెలిపారు. లేకపోతే సముద్రపు నీరు వల్ల ఇలా జరిగి ఉండవచ్చని, ఆమె వేలును ఏదైనా సముద్రపు జీవి తినేసి ఉండవచ్చని అన్నారు. 

కొలీజియం సిఫార్సులకు ఆమోదంలో జాప్యంపై సుప్రీం కోర్టు ఆవేదన.. కేంద్ర మంత్రి రిజిజు వ్యాఖ్యలపై అభ్యంతరం..

కాగా.. తమ కూతురును ఎవరో కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన అనంతరం హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముఖంపై యాసిడ్ పోసి తగలబెట్టి గుర్తుపట్టలేకుండా చేశారని తెలిపారు. ఒడిశా పోలీసులు, భోపాల్ పోలీసులు తమకు సహాయం చేయలేదని అన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత కూడా శవానికి ఉన్న గాయాలను పోలీసులు పట్టించుకోలేదని, ఇది సహజ మరణంగా ప్రకటించారని ఆరోపించారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ సింగ్‌ను కలిశారు. దీనిపై ఆయన ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. ‘‘మేము అసహజ మరణం కింద కేసు నమోదు చేశాం. అయితే కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో ఈ ఘటనపై దర్యాప్తు చేయవలసిందిగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారిని నేను ఆదేశించాను’’ అని తెలిపారు. 
 

click me!