మితిమీరుతోన్న పాక్ ఉగ్రచర్యలు.. మరోసారి పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం..  కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ 

By Rajesh KarampooriFirst Published Nov 29, 2022, 11:16 AM IST
Highlights

పంజాబ్ లోని అమృత్‌సర్ రూరల్ జిల్లా చహర్‌పూర్ గ్రామ సమీపంలో సోమవారం అర్థరాత్రి గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు డ్రోన్ల కదలికను చూశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పలు రౌండ్లు కాల్పులు జరిపి డ్రోన్‌ను కూల్చివేశారు. 

పాకిస్తాన్ ఉగ్రచర్యలకు అడ్డు అదుపు లేకుండా పోయాయి. రోజురోజుకు దాయాది దేశ ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిత్యం ఏదోక ఉగ్రదాడికి పాల్పడుతోంది. తాజాగా మరోసారి పాకిస్తాన్ ఉగ్రదాడికి పాల్పడింది. అయితే.. వెంటనే అప్రమత్తమైన భారత్ దానిని సమర్థవంతంగా ఎదుర్కొంది. భారత్‌-పాక్‌ సరిహద్దులో పాక్‌ డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) కూల్చివేసింది. ఈ ఘటన అమృత్‌సర్ రూరల్ జిల్లాలోని చహర్‌పూర్ గ్రామ సమీపంలో జరిగింది. 

వివరాల్లోకెళ్లే.. అమృత్‌సర్‌లోని చహర్‌పూర్ సమీపంలో సరిహద్దు వద్ద మోహరించిన BSF దళాలు గస్తీ కాస్తున్నాయి. ఆ ప్రాంతంలో పాకిస్తాన్ నుండి భారత భూభాగంలోకి ఓ డ్రోన్ ప్రవేశించింది. వెంటనే అప్రమత్తమైన భద్రత బలగాలు అనుమానిత డ్రోన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో దానిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బుల్లెట్ డ్రోన్‌కు తగిలి నేలపై పడింది. వెంటనే పోలీసులు ఇతర సంబంధిత ఏజెన్సీలను వెంటనే అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పాక్షికంగా దెబ్బతిన్న ఆ డ్రోన్ స్వాధీనం బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. దానితో పాటు చాహర్‌పూర్ గ్రామ సమీపంలో సరిహద్దు ఫెన్సింగ్‌ సమీపంలో వ్యవసాయ పొలంలో తెల్లటి పాలిథిన్‌లోని పలు అనుమానిత వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో భాగ్యశ్రీ, ప్రీతి అనే ఇద్దరు జవాన్లు పాల్గొన్నట్టు తెలిపారు.ఈ ఇద్దరు మహిళా జవాన్లను సన్మానించనున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. 

నవంబర్ 26న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ డ్రోన్‌ను BSF కూల్చివేసింది . పంజాబ్‌లోని తార్న్ తరణ్‌లో ఉన్న అమర్‌కోట్ గ్రామంలో శనివారం అర్థరాత్రి పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్ ప్రవేశం కనిపించింది. ఆ తర్వాత డ్రోన్‌ను చూసిన బీఎస్‌ఎఫ్ జవాన్లు పలు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం డ్రోన్ మళ్లీ పాకిస్థాన్ సరిహద్దులోకి ప్రవేశించింది. అదే రోజు.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని సరిహద్దు సమీపంలో ఇద్దరు చొరబాటుదారులను అక్రమంగా భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బీఎస్ఎఫ్ సమర్థవంతంగా వారి చర్యలు తిప్పికొట్టింది.
 
ముఖ్యంగా 2021తో పోలిస్తే భారత భూభాగంలోకి పాకిస్థానీ డ్రోన్‌ల చొరబాట్లు పెరిగాయి. సరిహద్దు వెంబడి ఈ సంవత్సరం దాదాపు 230 డ్రోన్‌ చొరబాట్లు కనిపించాయి. అయితే 2021లో ఆ సంఖ్య 104గానే ఉంది. 2020కి సంబంధించినంత వరకు కేవలం77 డ్రోన్‌ కదలికలే ఉండేవి. ఇందులో ఎక్కువగా  ఇండో-పాక్ సరిహద్దు,నియంత్రణ రేఖలో వెంబడే అధికంగా నమోదవుతున్నాయి. 

2020 నుండి ఇప్పటి వరకూ  పంజాబ్‌లో కనీసం 297 డ్రోన్‌ చొరబాట్లు కనిపించాయి. ఈ సంవత్సరం అక్టోబర్‌లో గుజరాత్, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లలో కూడా అనుమానాస్పద డ్రోన్ కార్యకలాపాలు  గమనించబడ్డాయి. ఈ డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేయబడుతోంది.

click me!