Asianet News TeluguAsianet News Telugu

దారుణం : సహాయం కోరిన గ్యాంగ్ రేప్ బాధితురాలిపై.. ప్రధానోపాధ్యాయుడి అత్యాచారం..

సామూహిక అత్యాచారానికి గురైన బాలిక సాయం కోరితే.. ఓ హెడ్మాస్టర్ అత్యాచారం చేసిన షాకింగ్ ఘటన బీహార్ లో వెలుగు చూసింది. 

Headmaster rapes teen who sought help after gangrape in bihar
Author
First Published Nov 29, 2022, 11:40 AM IST

పాట్నా: కైమూర్ జిల్లాలో 14 ఏళ్ల బాలికను నలుగురు అబ్బాయిలు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత బాలికను అక్కడే వదిలేసి వారు సంఘటన స్థలం నుండి పారిపోయారు. ఆ దారుణఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ఆమె.. ఓ వ్యక్తిని సహాయం కోరింది. అయితే, దీనస్థితిలో ఉన్న ఆ చిన్నారికి సహాయం చేయాల్సింది పోయి.. ఆమె పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఆమె మీద తాను కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సోమవారం పోలీసులు తెలిపారు.

గ్యాంగ్ రేప్ బాధితురాలి మీద అత్యాచారానికి పాల్పడిన ఆ వ్యక్తిని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పోలీసులు గుర్తించారు. దీనిమీద బాలిక తల్లిదండ్రులు శనివారం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు (55), ఒక మైనర్ అబ్బాయితో సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు భభువా ఎస్డీపీఓ సునీల్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రధానోపాధ్యాయుడిని శనివారం అరెస్టు చేసి జైలుకు పంపగా, సోమవారం బాలనేరస్థుడిని అరెస్టు చేసి రిమాండ్‌హోమ్‌కు పంపారు.

అత్యాచార బాధితురాలికి, నిందితులకు వైద్య పరీక్షలు చేశామని సింగ్ చెప్పారు. ఇతర నిందితుల కోసం వెతుకులాట కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 14 ఏళ్ల బాలిక, 8వ తరగతి విద్యార్థిని. శనివారం సాయంత్రం తమ గ్రామంలోని, ఇంటికి సమీపంలోని పొలానికి వెడుతుండగా ఈ సంఘటన జరిగింది.

మితిమీరుతోన్న పాక్ ఉగ్రచర్యలు.. మరోసారి పంజాబ్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం.. కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌

బాలిక ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... తను పొలానికి వెళ్లడానికి ఇంటి నుంచి బయటకు రాగానే తన క్లాస్ మేట్స్ ఇద్దరితో సహా నలుగురు అబ్బాయిలు తనను వెంబడించారని.. బలవంతంగా  కొండ ప్రాంతంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారని.. అక్కడ నలుగురూ కలిసి తనమీద అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. ఆ సమయంలో ఆమె కేకలు వేయకుండా ఒక అబ్బాయి చేతులతో తన నోటిని మూసేశాడని ఆమె పేర్కొంది. బాలికపై అబ్బాయిలు వంతులవారీగా అత్యాచారానికి పాల్పడుతుండగా, ప్రధానోపాధ్యాయుడు వారిని గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అతడిని చూడగానే మైనర్ బాలురు అక్కడి నుంచి పారిపోయారు. అయితే, ఆ వ్యక్తి తనను కాపాడతాడని బాధితురాలు భావించింది. అయితే అతను ఆ పని చేయకపోగా.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు మాట్లాడుతూ, అత్యాచారం తరువాత హెడ్‌మాస్టర్ బాలికను ఆమె ఇంటి వద్ద దింపాడని తల్లిదండ్రులు చెప్పినట్టు తెలిపారు. ఆ సమయంలో అతను ఆమె తల్లిదండ్రులకు విషయం చెబుతూ.. వారి కుమార్తె మీద నలుగురు అబ్బాయిలు అత్యాచారం చేశారని, తాను ఆమెను రక్షించానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. "అయితే, ప్రధానోపాధ్యాయుడు వెళ్లిపోయిన తర్వాత బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన విషయం మొత్తాన్ని వివరించింది. బాధితురాలిని చికిత్స కోసం సదర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు," అని అతను చెప్పాడు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)

Follow Us:
Download App:
  • android
  • ios