దారుణం.. కుమారుడికి గుండె జబ్బు నయమవుతుందని.. కూతురు గొంతు నులిమి హత్య చేసిన తల్లి.. ఎక్కడంటే ?

By team teluguFirst Published Nov 7, 2022, 4:07 AM IST
Highlights

పెద్ద బిడ్డకు గుండె జబ్బు నయం అవుతుందని భావించిన ఓ తల్లి కుమార్తెను హతమార్చింది. దీంతో పోలీసులు అమెను అరెస్టు చేశారు. ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని విచారణలో పోలీసులు గుర్తించారు. 

ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. అందులో పెద్ద కుమారుడు గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఆ కుమారుడు అంటే అతడి తల్లికి ఎంతో ప్రాణం. కానీ ఆమె మానసిక ఆరోగ్యం బాగాలేదు. ఆ బాలుడి ఆరోగ్యం మెరుగవ్వాలని ఆ తల్లి అల్లాడిపోయేది. అయితే అతడు అందరిలా మామూలు వ్యక్తి  కావాలంటే మరొకరిని బలి ఇవ్వాలని భావించింది. దీని కోసం మరో కూతురిని హత్య చేసింది. ఈ ఘటన రాజస్థాన్ లో సృష్టించింది.

జహంగీర్‌పురి హింసాకాండ కేసు.. నిందితులకు బెయిల్ మంజూరు.. ఒక రోజు తరువాత మళ్లీ అరెస్టు.. ఎందుకంటే ?

వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌ రాష్ట్రం బరన్ జిల్లాలోని అంటా పట్టణంలో ఓ కుటుంబ నివసించేది. భర్త ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అయితే భార్యకు మానసిక ఆరోగ్యం సరిగా లేదు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు కూతురు కాగా మరో ఇద్దరు కుమారులు. అయితే 16 ఏళ్ల పెద్ద కుమారుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ పెద్ద కుమారుడు అంటే ఆ తల్లి ఎంతో ఇష్టపడేది. 

పెద్ద కుమారుడి ఆరోగ్యం మెరుగవ్వాలంటే ఒకరిని బలి ఇవ్వాలని ఆమె అనుకుంటూ ఉండేది. ఈ క్రమంలో గతంలో ఒక సారి భర్తపై దాడి చేసింది. అయితే కుమారుడి కోసం ఆమె ఇలాంటి చర్యకు పాల్పడిందని ఆ సమయంలో ఆ కుటుంబానికి అర్థం కాలేదు.  తరువాత ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఈ క్రమంలో శనివారం రోజు ఆమె భర్త ఎప్పటిలాగే ఆటో నడపడానికి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఏడేళ్ల చిన్న కుమారుడు, 13 ఏళ్ల కూతురు, అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద కుమారుడు ఉన్నారు.

హనీ ట్రాప్ లో ఢిల్లీ క్రికెటర్.. యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్.. చివరికి..

ఇదే మంచి సమయం అని భావించిన ఆ తల్లి ముందుగా చిన్న కుమారుడిని చంపాలని భావించింది. ఆ బాలుడిపై దాడికి ప్రయత్నించింది. దీంతో ఆమె నుంచి ఆ పిల్లాడు తప్పించుకొని బయటకు పరిగెత్తింది. వెనువెంటనే ఆమె 13 ఏళ్ల కూతురును పట్టుకొని బాత్ రూమ్ లోకి లాగి దాడి చేయడం ప్రారంభించింది. అనంతరం ఇంటి వరండాలోకి తీసుకొని గుడ్డతో గొంతు నిలిమి చంపేసిందని ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదించింది.

అంధేరి ఈస్ట్‌లో ఉద్ధవ్‌ థాక్రే వర్గం గెలుపు.. కానీ ట్విస్ట్ ఇచ్చిన ఓటర్లు

చిన్న పిల్లల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అప్రమత్తం అయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ అన్ని గేట్లకు తాళం వేసి ఉండటంతో సమయానికి ఇంటి లోపలికి చేరుకోలేపోయారని ఆ వార్తా కథనం పేర్కొంది. అయితే వారు అన్ని తాళాలు పగులగొట్టి అపస్మారక స్థితిలో ఉన్న బాలికను హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. హాస్సిటల్ కు తీసుకెళ్లిన వెంటనే పరీక్షించిన డాక్టర్లు.. అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించారు. ఈ కేసులో నిందితురాలైన మహిళను అంతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో మహిళ మానసిక స్థితి సరిగా లేదని నిర్ధారించారు.

click me!