హనీ ట్రాప్ లో ఢిల్లీ క్రికెటర్.. యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్.. చివరికి..

By team teluguFirst Published Nov 7, 2022, 12:09 AM IST
Highlights

ఆయన ఓ క్రికెటర్. పలు మ్యాచ్ లలో పాల్గొనేందుకు వేరే సిటీకి వెళ్లాడు. ఆ సమయంలో సరదాగా ఓ యువతితో గడిపాడు. అయితే ఆమె ఆ క్రికెటర్ కు తెలియకుండా ఫొటోలు, వీడియోలు రికార్డు చేసింది. వాటి ఆధారంగా ఓ గ్యాంగ్ అతడిని బ్లాక్ బెయిల్ చేసింది.

ఢిల్లీకి చెందిన ఓ క్రికెటర్‌ హనీ ట్రాప్ లో పడ్డాడు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన మహిళతో అతడు సన్నిహితంగా మెలిగాడు. హొటల్ గదిలో గడిపాడు. అయితే దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూపించి అతడిని ఓ ముఠా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. దీంతో ఇందులో ప్రమేయం ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

అంధేరి ఈస్ట్‌లో ఉద్ధవ్‌ థాక్రే వర్గం గెలుపు.. కానీ ట్విస్ట్ ఇచ్చిన ఓటర్లు

వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ క్రికెటర్ (ఆయన పరువు, ప్రతిష్టలను కాపాడేందుకు పోలీసులు బాధితుడి పేరును వెల్లడించలేదు.) అక్టోబరు నెలాఖరులో కోల్‌కతాలో జరిగే కొన్ని మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు ఆ సిటీకి వెళ్లాడు. అతను సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఒక లక్సరీ హోటల్ లో బస చేశాడు. అయితే అక్కడ డేటింగ్ యాప్ ద్వారా కొందరు వ్యక్తులు ఆయనకు పరిచయం అయ్యారు. 

నవంబర్ 1వ తేదీన బిధాన్‌నగర్ సిటీ పోలీస్ పరిధిలోకి వచ్చే బగుయాటి ప్రాంతంలోని బస్ స్టాప్‌లో ఓ ఐదుగురు వ్యక్తులు క్రికెటర్ ను కలిశారు. అక్కడ ఆయనకు కొందరు మహిళల ఫొటోలు చూపించారు. వారిలో నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాలని సూచించారు.  దీంతో వారు చూపించిన ఫొటోలో నుంచి ఓ యువతిని సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో ఆ యువతి అతడి హొటల్ కు వచ్చింది. ఆ క్రికెటర్ తో సన్నిహితంగా గడిపింది. అయితే ఆ సమయంలో వారిద్దరు ఏకాంతంగా ఉన్న క్షణాలను ఆమె రికార్డు చేసింది. ఈ విషయం ఆ క్రికెటర్ కు తెలియదు.

బైపోల్స్‌లో దూసుకెళ్లిన బీజేపీ.. ఏడింట నాలుగు స్థానాలు కమలం కైవసం.. ఫలితాలపై టాప్ పాయింట్స్ ఇవే

తరువాత ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే రోజు సాయంత్రం సమయంలో నలుగురు నిందితులు ఆ ఢిల్లీ క్రికెటర్ ను కలిశారు. ఆ యువతితో ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను అతడికి చూపించారు. దీంతో అతడు షాక్ గురయ్యాడు. తమకు భారీగా డబ్బులు ఇవ్వకపోతే వీటిని బయటపెడుతామని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో సమాజంలో తన పరువును కాపాడుకోవాలనే ఉద్దేశంతో అతడు వెంటనే బయపడిపోయి నెట్ బ్యాంకింగ్ ద్వారా వారి అకౌంట్ లకు రూ. 60 వేలను ట్రాన్స్ ఫర్ చేశారు. దీంతో ఆ పాటు ఆ క్రికెటర్ తన వద్ద ఉన్న బంగారపు గొలుసు, ఖరీదైన మొబైల్ ఫోన్‌ను కూడా వారికి ఇచ్చాడు.

ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ రియాక్షన్.. సోషల్ మీడియాలో వైరల్

ఇక్కడితో వారి వేధింపులు ఆగిపోలేదు. మళ్లీ కాల్స్ వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభమయ్యాయి. దీంతో విసిగిపోయిన క్రికెటర్ నవంబర్ 2వ తేదీన స్థానిక బగుయాటి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాడు. తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్రికెటర్ అందించిన వివరాల ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు బగుయాటి ప్రాంతంలోనే అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురిని రిషవ్ చందా, శుభోంకర్ బిశ్వాస్, శివ సింగ్‌లుగా గుర్తించారు. కాగా.. ఈ హనీ ట్రాపింగ్ రాకెట్ ప్రధాన సూత్రధారి ఇంకా పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని దర్యాప్తు అధికారులు చెప్పారని ‘జీ న్యూస్’ నివేదించింది.

click me!