దారుణం.. ఇస్లాంలోకి మారాలని గర్భవతి అయిన సహజీవన భాగస్వామిపై ఒత్తిడి.. విషప్రయోగం చేయడంతో మృతి..

By Asianet NewsFirst Published May 29, 2023, 8:47 AM IST
Highlights

యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న యువతిని ఇస్లాం మతంలోకి రావాలని ఒత్తిడి తీసుకొచ్చినా ఆమె వినలేదు. దీంతోె గర్భంతో ఉందని కూడా చూడకుండా ఆమెపై విషప్రయోగం చేశాడు. బాధితురాలు మరణించింది.

ఇస్లాం మతంలోకి మారాలని సహజీవన భాగస్వామిపై ప్రేమికుడు ఒత్తిడి చేశాడు. ఆమె మాట వినకపోవడంతో గర్భంతో ఉందని కూడా చూడకుండా విష ప్రయోగం చేశాడు. అనంతరం అతడితో పాటు మరో వ్యక్తి కలిసి ఆమెను హాస్పిటల్ కు తీసుకొచ్చారు. కానీ కొంత సమయం తరువాత ఆ 24 ఏళ్ల యువతి మరణించింది. దీంతో వారిద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. గర్భిణి మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ పోలీసులు అరెస్టు చేశారు. 

ఉజ్జయినిలో పిడుగుపాటు.. మహాకాల్ లోక్ కారిడార్ లో ఆరు విగ్రహాలు ధ్వంసం.. దేవుడు కూడా విసిగిపోయాడన్న ఆర్జేడీ..

పోలీసులు, బాధితురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని లఖింపూర్ ఖేరీకి చెందిన 24 ఏళ్ల సీమా గౌతమ్, ముస్లిం మతానికి చెందిన నవేద్ లు ప్రేమించుకున్నారు. సుమారు ఏడాదిన్నరగా వీరిద్దరూ జిల్లాలోని రోజా ప్రాంతంలో ముస్తాకిమ్ కు చెందిన అద్దె ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. కొంత కాలం తరువాత సీమా గౌతమ్ గర్భం దాల్చింది. 

అయితే ఆమెను ఇస్లాం మతంలోకి మారాలని ప్రియుడు ఒత్తిడి తీసుకొస్తున్నాడు. దీనికి ఆమె నిరాకరించింది. ఈ విషయంలో ఆమెను బలవంతం చేసినా వినకపోవడంతో, గర్భవతి అని కూడా చూడకుండా శనివారం విష ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. దీంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి చేరుకుంది. అయితే నిందితుడు నవేద్, ఫర్హాన్ అనే మరో వ్యక్తి సహాయంతో లఖింపూర్ ఖేరి జిల్లా హాస్పిటల్ కు తీసుకొచ్చారు. 

నిజామాబాద్ లో ఘోరం.. కన్న తల్లిని రోకలి బండతో కొట్టి హతమార్చిన కూతురు

హాస్పిటల్ లో అడ్మిట్ చేసే సమయంలో నవేద్ పేషెంట్ పేరు జోయా సిద్ధిఖీ అని, ఆమె తనకు భార్య అవుతుందని చెప్పాడు. కానీ కొంత సమయం తరువాత బాధితురాలి పరిస్థితి విషమించడంతో మరణించింది. ఈ విషయాన్ని డాక్టర్లు వారికి తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వచ్చేలోపే ఆ ఇద్దరు నిందితులు పారిపోయారు. 

విచారణలో బాధితురాలు హిందువు అని, నవేద్ తో ఏడాదిన్నర కాలంగా సహజీవనం చేస్తోందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ ఆనంద్ వార్తా సంస్థ ‘పీటీఐ’ తెలిపారు. ఆమె గర్భవతి అని, ఈ జంట ముస్తాకిమ్‌కు చెందిన అద్దె వసతి గృహంలో ఉండేవారని చెప్పారు. మతం మారాలని నిందితులు ఆమెపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు.

పార్లమెంటును శవపేటికతో పోల్చడం తప్పు - అసదుద్దీన్ ఒవైసీ.. ఆర్జేడీ తీరుపై ఫైర్

కాగా.. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవేద్, ఫర్హాన్‌, ముస్తాకిమ్ అనే వ్యక్తులులపై భారతీయ శిక్షాస్మృతి, షెడ్యూల్ కులం/షెడ్యూల్ తెగ చట్టం, ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవేద్, ఫర్హాన్ లను అరెస్టు చేసి జైలుకు తరలించగా.. ముస్తాకిమ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
 

click me!