‘నేను వెళ్లకపోవడమే మంచిదైంది..’ కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు 

By Rajesh KarampooriFirst Published May 29, 2023, 7:42 AM IST
Highlights

పాత పార్లమెంట్‌తో ప్రజలకు వేరే సంబంధం ఉందని, కొత్త పార్లమెంట్‌కు సంబంధించి ప్రతిపక్షాలతో ఎలాంటి చర్చలు జరగలేదని శరద్ పవార్ అన్నారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సమాజం పట్ల ఉన్న దృక్కోణానికి పూర్తి భిన్నంగా ప్రారంభోత్సవం జరిగిందని పవార్ అన్నారు. 

కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు పాల్గొనగా, పలు ప్రతిపక్ష పార్టీ ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాని వారిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఉన్నారు. కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంపై శరద్ పవార్  స్పందించారు. తాను  వెళ్లకపోవడమే మంచిదన్నాడు.

"ఈ ఈవెంట్ పరిమిత సంఖ్యలో వ్యక్తుల కోసం మాత్రమేనా?"

కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా హవాన్ నిర్వహించడం, సర్వమత ప్రార్థనలు నిర్వహించడం, 'సెంగోల్' తీసుకురావడం గురించి శరద్ పవార్  వ్యాఖ్యానించారు. ఈ ఘటనలను తాను చూశానని చెప్పారు. ఆ ఘటనలు చూసిన తర్వాత నేను అక్కడికి వెళ్లకపోవడమే మంచిదనిపించింది. ప్రారంభోత్సవ వేడుకలో ఏం జరిగిందో చూసి తాను ఆందోళన చెందానని తెలిపారు.  ఈ పరిణామాలతో మన దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా? ఈ ఈవెంట్ పరిమిత సంఖ్యలో వ్యక్తుల కోసం మాత్రమే జరిగిందా? కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఏం జరిగినా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సమాజం దార్శనికతకు విరుద్ధమని ఆయన అన్నారు.

"పండిట్ నెహ్రూ దృక్కోణానికి పూర్తి విరుద్ధం"

శరద్ పవార్ మాట్లాడుతూ.. అక్కడ ఏం జరిగినా పండిట్ నెహ్రూ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆధారంగా నిర్మించాలనుకున్న సమాజ దార్శనికతకు వ్యతిరేకమన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం ప్రభుత్వ బాధ్యత. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకాగా, రాజ్యసభ అధినేత, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌కర్ అక్కడ లేరు. కాబట్టి ప్రోగ్రామ్ మొత్తం పరిమిత సంఖ్యలో వ్యక్తుల కోసం ఉద్దేశించినట్లుగా కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. 

ప్రతిపక్షంతో చేసిందేమీ లేదు

పాత పార్లమెంట్‌తో ప్రజలకు వేరే సంబంధం ఉందని, కొత్త పార్లమెంటుకు సంబంధించి ప్రతిపక్షాలతో ఎలాంటి చర్చలు జరగలేదని శరద్ పవార్ అన్నారు. పాత పార్లమెంటు సభ్యునిగా మాకు వేరే అనుబంధం ఉందని... కొత్త పార్లమెంట్ గురించి ప్రతిపక్ష నేత ఎవరూ మాట్లాడలేదన్నారు. కొత్త పార్లమెంటు ఏర్పాటుకు ముందే అందరి అభిప్రాయం తీసుకుంటే బాగుండేదని అన్నారు. 

ఇది అసంపూర్ణ సంఘటన - సుప్రియా సూలే

 కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవాన్ని "అసంపూర్ణ కార్యక్రమం" అని ఎన్‌సిపి సుప్రియా సూలే  పిలిచారు. ప్రతిపక్షం లేకుండా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం అసంపూర్తి కార్యక్రమం లాంటిదని అన్నారు.

click me!