ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. రెండేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బయట ఆడుకుంటున్న సమయంలో బాలికను తన ఇంటికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు.
ప్రస్తుతం సమాజంలో మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డారు.
వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ ప్రాంతానికి చెందిన రెండేళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి జీవిస్తోంది. ఇటీవల తన ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఆ సమయంలో బాలిక తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ ఇంటికి సమీపంలోనే నివసించే 60 ఏళ్ల వృద్ధుడు అశోక్ కుమార్ గోస్వామి అటుగా వచ్చాడు.
బాలికకు మాయమాటలు చెప్పి, తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారానాకి పాల్పడ్డాడు. బాలిక ఇంటికి తిరిగి వచ్చిన తరువాత నిందితుడు తనపై జరిపిన దాడిని తల్లిదండ్రులకు బాధితురాలు వివరించింది. దీంతో తల్లింద్రుడులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో రెండేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడని, నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు మంగళవారం (నవంబర్ 7) తెలిపారు. బాధితురాలి తల్లి బయటకు వెళ్లి బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన నగరంలో చోటు చేసుకుంది. నిందితుడు అశోక్ కుమార్ గోస్వామి ఆమెను తనతో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు.
telangana assembly election 2023 : జగిత్యాలలో నామినేషన్ దాఖలు చేసిన 82 ఏళ్ల వృద్ధురాలు..
దీనిపై సమాచారం అందిన వెంటనే సర్కిల్ ఆఫీసర్ బిను సింగ్, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధితురాలని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. నిందితుడిని అదుపుతోకి తీసుకున్నారు. అతడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.