కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా నక్సలైట్ల ఆగడాలు పెరుగుతున్నాయి.. ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని మోదీ..

By Sumanth Kanukula  |  First Published Nov 7, 2023, 5:02 PM IST

కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఉగ్రవాదులు, నక్సలైట్ల ఆగడాలు పెరుగుతాయని అన్నారు.


కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఉగ్రవాదులు, నక్సలైట్ల ఆగడాలు పెరుగుతాయని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిష్రాంపూర్‌లో మంగళవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నక్సలిజాన్ని అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్ల ధైర్యం పెరుగుతోంది, నక్సల్స్ హింసను నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, ఇటీవలి కాలంలో చాలా మంది బీజేపీ కార్యకర్తలు మన నుంచి దూరమయ్యారు. కొద్ది రోజుల క్రితం మన కార్యకర్తలను కాల్చి చంపారు’’ అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా డివిజన్‌లో మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ వ్యాపారం పెరిగిపోతున్నాయని ఆరోపించారు. 

Latest Videos

‘‘మా అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు నేరగాళ్లను టార్గెట్ చేస్తున్నారు.. గిరిజన కుటుంబాలకు చెందిన చాలా మంది బాలికలు అదృశ్యమయ్యారు.. దీనికి కాంగ్రెస్‌ నేతల వద్ద సమాధానం లేదు. కాంగ్రెస్‌ బుజ్జగింపు విధానం కారణంగా ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా ప్రాంతంలో పండుగలు జరుపుకోవడం కష్టతరంగా మారింది’’ అని మోదీ అన్నారు. 

ద్రౌపది ముర్ము భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతి అవ్వకుండా ఆపడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. 'ఆదివాసీ' కుటుంబం నుంచి వచ్చిన మహిళ భారత రాష్ట్రపతి కాగలదని ఎవరైనా అనుకున్నారా? అని అడిగారు. ద్రౌపది ముర్ము భారత తొలి గిరిజన అధ్యక్షురాలు కాకుండా ఆపేందుకు కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిందో ఊహించలేమని.. కానీ కానీ ఆమెకు ఈ గౌరవం కల్పించింది బీజేపీయేనని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఆదివాసీల కోసం డబ్బు ఖర్చు చేయడం వృధా అనేది వారి ఆలోచన అని ఆయన అన్నారు. 

అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఛత్తీస్‌గఢ్‌ను బీజేపీ ఏర్పాటు చేసిందని మోదీ చెప్పారు. ఈరోజు ఛత్తీస్‌గఢ్ మొత్తం బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటుందని అన్నారు. 

ఇక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. నేడు(నవంబర్ 7) తొలి దశ పోలింగ్ జరుగుతుంది. రెండో దశ పోలింగ్ నవంబర్ 17న జరగనుంది. ఇక, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
 

click me!