గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను 2008లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ సమయంలో అతీక్ ను పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు, చోటు చేసుకున్న పరిణామాలను మాజీ పోలీసు అధికారి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మాఫియా డాన్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్యకు గురైన తరువాత వారికి సంబంధించిన అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో అతిక్ అహ్మద్ ను అరెస్టు చేసిన సమయంలో చోటు చేసుకున్న ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ డైరెక్టర్ కర్నాల్ సింగ్ వెల్లడించారు. అది 2008లో జరిగింది. ఆ సమయంలో ఆయన ఢిల్లీ స్పెషల్ సెల్ లో పని చేస్తున్నారు. అతిక్ వైపు పోలీసులు గన్ గురి పెట్టిన సమయంలో అతడు తన ప్యాంటులోనే మూత్రం పోసుకున్నాడని తెలిపారు.
ట్విట్టర్ లో బ్లూ టిక్ కోల్పోయిన యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖాతాలు.. ఎందుకంటే ?
మాజీ ఈడీ డైరెక్టర్ అయిన కర్నాల్ సింగ్ గురువారం వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అతిక్ అహ్మద్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “ నేను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్‌లో పని చేస్తున్నప్పుడు 2008 జనవరిలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో స్పెషల్ సెల్ ఉత్తర భారతదేశానికి చెందిన భయంకరమైన నేరస్థుల డేటాబేస్‌ను తయారు చేసింది. అతిక్ కూడా జాబితాలో ఉన్నాడు. అతడిపై రూ. 1 లక్ష నగదు బహుమతి ఉంది.” అని ఆయన తెలిపారు.
యువకుడిపై అత్యాచారం.. బస్సులో నుంచి దించి మరీ దారుణం.. వీడియో తీసి డబ్బులు వసూలు..
‘‘ఆ సమయంలో అతీక్‌ను ట్రాక్ చేయడానికి ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బృందం పని చేయడం ప్రారంభించింది. స్పెషల్ సెల్ ఒక కేసును దర్యాప్తు చేయడం మొదలు పెడితే నిందితుడిపై నమోదైన కేసులు, అతడి సహచరుల వరకు ప్రతీ వివరాలను క్లోజ్ గా ట్రాక్ చేస్తుంది. అలాగే మా టీమ్ అతీక్ షార్ప్‌షూటర్ ఫోన్ నంబర్‌ను సంపాదించింది. దీంతో ఆ నెంబర్ ను ట్రాక్ చేయడం ప్రారంభించాం. అయితే ఒక రోజు అతడి కాల్ మాట్లాడుతుండగా..అతీక్ ఢిల్లీలోని పితంపురలోని ఒక ఇంట్లో ఉంటున్నట్లు చెప్పాడు.’’ అని కర్నాట్ సింగ్ తెలిపారు.
‘‘ ఫోన్ కాల్ లో విన్న సమాచారం అధారాంగా స్పెషల్ సెల్ టీం లొకేషన్ కు చేరుకుంది. అతీక్ అహ్మద్ ఉంటున్న ఇళ్లును చుట్టుముట్టింది. అతడు ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కేందుకు సిద్ధమవుతుండగా.. ఓ పోలీసు అధికారి ఎదురుగా వెళ్లి కాల్పులు జరిపాడు. నేరుగా అతీక్ కు తుపాకీ గురి పెట్టి కారు దిగాలని చెప్పాడు. చుట్టూ ఉన్న టీమ్ స్పెషల్ సెల్ నుండి వచ్చిందని అని తెలపడంతో అతీక్ భయపడిపోయాడు. అతడి ప్యాంటులోనే మూత్రం పోసుకున్నాడు. తరువాత అతీక్ ను స్పెషల్ సెల్ ఆఫీసుకు తీసుకొచ్చాం. అనంతరం ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించాం.’’ అని కర్నాట్ సింగ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
జమ్మూకాశ్మీర్ పూంచ్ లో భారీ ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి.. దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ
కాగా.. ఏప్రిల్ 15నవ తేదీన అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ ను ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. వీరు జర్నలిస్టులుగా నటిస్తూ అక్కడి వచ్చి కాల్పులు జరిపారు ఏప్రిల్ 13న ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్ లో అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో అసద్ అహ్మద్ అనుచరుడు గులాం కూడా మృతి చెందాడు. ఉమేష్ పాల్ హత్య కేసులో అసద్, గులాం నిందితులుగా ఉన్నారు.