
ప్రయాగ్‌రాజ్: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ ఉత్తరప్రదేశ్ పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించాడు. తనకు పాకిస్తాన్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తాయిబాకు నేరుగా లింకులు ఉన్నాయని తెలిపాడు.
ప్రయాగ్‌రాజ్ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్‌ను గురువారం ఉదయం హాజరుపరిచారు. ఉమేష్ పాల్ మర్డర్ కేసులో వారిద్దరినీ నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపించారు. వారిద్దరి కస్టడీ ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఏప్రిల్ 17వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఉన్నది.
కోర్టులో యూపీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ చార్జిషీట్‌లో అతీక్ అహ్మద్ స్టేట్‌మెంట్‌ను పేర్కొన్నారు. ఆ స్టేట్‌మెంట్ ఇలా ఉన్నది.
Also Read: UP Encounter: నా కొడుకు చావుకు నేనే బాధ్యుడిని.. కోర్టులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కన్నీరుమున్నీరు
‘... నాకు ఆయుధాలకు కొదవలేదు. పాకిస్తాన్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తాయిబాలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. డ్రోన్‌ల సహాయంలో ఆయుధాలను పాకిస్తాన్ నుంచి పంజాబ్ బార్డర్‌లో వదిలిపెడతారు. స్థానికంగా ఉండే తన మనుషులు వాటిని కలెక్ట్ చేసుకుంటారు. ఇలాంటి కన్‌సైన్‌మెంట్ ద్వారానే జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాదులు ఆయుధాలు పొందుతారు. నన్ను మీరు అక్కడికి తీసుకెళ్లితే.. ఆ ఘటనలో ఉపయోగించిన డబ్బులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలను రికవరీ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాను’ అని అతీక్ అహ్మద్ యూపీ పోలీసులకు వెల్లడించినట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.