
Asad Ahmed Encounter: ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడైన అసద్ అహ్మద్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దాదాపు రెండు నెలలుగా అసద్ అహ్మద్‌ను యూపీ పోలీసులు, ఎస్టీఎఫ్ బృందాలు ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్‌తో పాటు షూటర్ గులాం కూడా హతమొందించారు. ఈ ఘటనతో యూపీలో ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే..మాఫియాను నాశనం చేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అసెంబ్లీలో సీఎం యోగి గర్జించిన క్షణం గుర్తుంచుకోండి. ఆయన ఇచ్చిన మాట ప్రకారం.. మాఫియాను మట్టిలో కలపడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ జాబితాలో మాఫియా అతిక్ అహ్మద్ పేరు కూడా చేరిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం మోడీ ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
ఇంతకీ ఆ వీడియో ఏముందంటే.. ?
ఉమేష్ పాల్ హత్య అనంతరం .. శాసనసభ బడ్జెట్ సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) నాయకుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో అఖిలేష్ వైపు వేలు చూపుతూ 'మాఫియాను మట్టిలో కలిపేస్తాం'అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. “నేను ఈ రోజు ఈ సభలో చెప్తున్నాను, ఈ మాఫియాను నేలమట్టం చేస్తాను. అతిక్ అహ్మద్ ను పెంచి పోషించింది సమాజ్ వాదీ పార్టీ కాదా ..? ఆయన వెన్ను విరిచేందుకు మేము ఉన్నాం. " అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే.. అతిక్ అహ్మద్ ఉద్దేశించి మాట్లాడుతూ.. 'స్పీకర్ సార్, అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ ఫాదర్ ఆయనే. వారి సిరల్లో నేరాలున్నాయి. నేను నేడు అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ఈ కరుడుకట్టిన మాఫియాను మట్టి కరిపిస్తా' అని సీఎం యోగి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
మరోవైపు అసద్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అధికారులందరినీ సీఎం యోగి ప్రశంసించారు. దీంతోపాటు హడావుడిగా వారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం యోగి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. దీనిపైనే అందరి దృష్టి ఉంటుంది. అదే సమయంలో, ఫోరెన్సిక్ విభాగం బృందం దర్యాప్తు ప్రారంభించింది. అయితే, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. దీనిపైనే అందరి దృష్టి ఉంటుంది. ఇదే సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌తో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
"ఎన్‌కౌంటర్‌లపై విచారణ జరగాలి"
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ను, అతని సహాయకుడిని ఝాన్సీలో హత్య చేసినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం "ఫేక్ ఎన్‌కౌంటర్" నిర్వహించిందని ఎస్‌పి చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలోని వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి కోర్టులపై నమ్మకం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. అధికారంలో ఉన్నవారు ఎవరు ఒప్పో, తప్పుదో నిర్ణయించుకోవడం సరికాదని, ఎవరు బతకాలో, చావాలని నిర్ణయించడం సరికాదన్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లను కూడా క్షుణ్ణంగా విచారించాలని, దోషులను విడిచిపెట్టకూడదని డిమాండ్ చేశారు.