యూపీలో బస్సు, ట్రక్కు ఢీ: తొమ్మిది మంది మృతి, 27 మందికి గాయాలు

By narsimha lodeFirst Published Oct 7, 2021, 10:47 AM IST
Highlights

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 27 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఢిల్లీ నుండి లక్నో మీదుగా యూపీలోని బహ్రెయిచ్ కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొంది.

లక్నో:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకొందని యూపీ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టుగా జిల్లా మేజిస్ట్రేట్ ఆదర్శ్ సింగ్ చెప్పారు.

 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకొందని యూపీ పోలీసులు తెలిపారు. pic.twitter.com/6NpX6u7iRV

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 delhi నుండి లక్నో మీదుగా యూపీలోని బహ్రెయిచ్ కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రక్కు bus ఢీకొనడంతో ప్రయాణీకులు మరణించారని Barabanki  జిల్లా అధికారులు ప్రకటించారు.

టూరిస్ట్ బస్సు ఇవాళ ఉదయం ఐదున్నర గంటల సమయంలో దేవ కొత్వాల్ ప్రాంతంలో కిసాన్ పాత్‌లోని బాబూరి గ్రామానికి చేరుకొంది. అయితే ఆ సమయంలో ఎదురుగా వచ్చిన truck   టూరిస్ట్ బస్సును ఢీకొట్టింది.ఈ  సమయంలో టూరిస్ట్ బస్సు, ట్రక్ లు చాలా వేగంగా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ సమాచారం అందుకొన్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.సంఘటన స్థలంలోనే 9 మంది మరణించారు. 27 మంది గాయపడ్డారు.  ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
 


 

click me!