Coronavirus: ఫిబ్రవరి 15 నుంచి స్కూల్స్ రీఒపెన్ !

By Mahesh Rajamoni  |  First Published Feb 2, 2022, 12:57 PM IST

Coronavirus: భార‌త్ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కొన‌సాతుగున్న‌ది. రోజువారీ కొత్త కేసులు ల‌క్ష‌ల్లోనే న‌మోద‌వుతున్నాయి. అయితే, కొన్ని రాష్ట్రాల్లో క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో క‌రోనా ఆంక్ష‌లు స‌డ‌లిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఫిబ్ర‌వ‌రి 15 నుంచి స్కూల్స్ రీఒపెన్ చేస్తామ‌ని అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ తెలిపారు. 
 


Coronavirus: అన్ని దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. భార‌త్ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కొన‌సాతుగున్న‌ది. రోజువారీ కొత్త కేసులు ల‌క్ష‌ల్లోనే న‌మోద‌వుతున్నాయి. అయితే, కొన్ని రాష్ట్రాల్లో క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో క‌రోనా ఆంక్ష‌లు స‌డ‌లిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఫిబ్ర‌వ‌రి 15 నుంచి స్కూల్స్ రీఒపెన్ చేస్తామ‌ని అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించాలని యోచిస్తోందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ  మీడియాతో మాట్లాడుతూ అన్నారు.  ఫిబ్రవరి 15 నుండి పాఠశాలలు తిరిగి తెరవబడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం COVID పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం కర్ఫ్యూ సమయాల్లో సడలింపులను కూడా ప్రకటించవచ్చని ఆయన అన్నారు. "ప్ర‌స్తుతం కొనసాగుతున్న క‌రోనా ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్నాం.. ఆంక్ష‌లు స‌డ‌లించే విష‌యం గురించి కూడా చ‌ర్చిస్తున్నాము. రోజువారీ కేసులు వేయికి కంటే త‌క్కువ‌కు వ‌చ్చేవ‌ర‌కు వేచి ఉన్నాం. బహుశా మరో రెండు నుండి మూడు రోజులు రోజువారీ కేసులు వేయికంటే త‌క్కువ‌కు చేర‌వచ్చు. ఇదే జ‌రిగితే  ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న  నైట్ కర్ఫ్యూ లో స‌డ‌లింపులు తీసుకువ‌స్తాం.స్కూల్స్ రీఒపెన్ చేస్తాం" అని అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ అన్నారు.

Latest Videos

undefined

క‌రోనా ప్రభావం నేప‌థ్యంలో జనవరి 25 నుండి పాఠశాలల్లో 8వ తరగతి వరకు భౌతిక తరగతులు నిలిపివేశారు. 15-18 ఏళ్లలోపు దాదాపు తొమ్మిది లక్షల మంది పిల్లలకు ఇప్పటి వరకు టీకాలు వేయించామని, అయితే పాఠశాలలు తెరిస్తే పిల్లలకు టీకాలు వేయడం సులువవుతుందని అసోం ముఖ్యమంత్రి శ‌ర్మ అన్నారు. ప్రస్తుతం 9వ తరగతి, అంతకంటే ఎక్కువ తరగతుల వార‌కి భౌతిక త‌ర‌గ‌తులు కొన‌సాగుతున్నాయి.  క‌రోనా టీకా కార్య‌క్ర‌మాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 28 నాటికి లబ్ధిదారులకు రెండు డోసులను పూర్తి చేయాలని భావిస్తున్నామ‌ని తెలిపారు. కాగా, అసోంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 7,17,892 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కొత్త‌గా 1,486 కోవిడ్‌-19 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వైర‌స్ తో పోరాడుతూ గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6,481కి పెరిగింది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చ‌ర్య‌లను చేప‌ట్టింది. క‌రోనా ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది.

ఇదిలావుండగా, 24 గంటల్లో కొత్తగా 1,61,386 కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. రికవరీలూ అంతకు మించే ఉన్నాయి. 24 గంటల్లో 2,81,109 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్టు తెలిపింది. కాగా, 1,733 మంది కరోనా పేషెంట్లు మరణించినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. అత్యధిక కేసులు నమోదు చేస్తున్న టాప్ స్టేట్స్‌లలో కేరళ(51,887 కేసులు), తమిళనాడు(16,096 కేసులు), మహారాష్ట్ర(14,372 కేసులు), కర్ణాటక(14,366 కేసులు), గుజరాత్(8,338 కేసులు)లు ఉన్నాయి.

click me!