
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీ(Delhi Factory)లోని ఆయిల్ ట్యాంక్(Oil Tank)లు మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. ఆయిల్ ట్యాంక్‌లోని మంటలు మొత్తం ఫ్యాక్టరీని చుట్టేసేంత బలంగా ఎగసిపడ్డాయి. నైరుతి ఢిల్లీలోని గుమన్ హెరా ఏరియాలో ఈ ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం గురించి అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలికి బయల్దేరాయి. అగ్నిమాపక శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ, ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంక్‌లో మంటలు వ్యాపించాయని తెలిపారు. ఇది భారీ ప్రమాదానికి దారి తీసే ముప్పు ఉండిందని వివరించారు.
ఈ ప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఫైర్ ఇంజిన్లు స్పాట్‌కు చేరాయి. సుమారు పది అగ్నిమాపక యంత్రాల వరకు ఈ ఘటనా స్థలికి చేరుకున్నాయి. అన్ని ఫైరింజన్లు ఆ మంటలను ఆర్పే పనిలో పడ్డాయి. రెండు గంటలపాటు మంటలను అదుపులోకి తేవడానికి శాయశక్తుల సిబ్బంది పని చేశారు. రెండు గంట తర్వాత ఆ మంటలు అదుపులోకి వచ్చాయి. వెంటనే ఆయిల్ ట్యాంక్‌లోని మంటలు వేగంగా మొత్తం ఫ్యాక్టరీనే కమ్మేసే ముప్పు ఉంది. దీంతో ఆ ఫ్యాక్టరీలోని వారందరినీ వెంటనే బయటకు పంపించామని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేవని చెప్పారు. అగ్నిమాపక అధికారులకు సహాయం చేయడానికి స్థానిక పోలీసు అధికారులు స్పాట్‌కు వచ్చారు.
ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆయిల్, ఎలక్ట్రిక్ కేబుల్‌ల దగ్గర అగ్ని ప్రమాదం జరిగిందని ఓ అధికారి తెలిపారు. అయితే, ఉదయం7.30 గంటల కల్లా మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని వివరించారు. ప్రస్తుతం ఆ స్థానిక పోలీసు అధికారులు ఈ ప్రమాదంలో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. ఫ్యాక్టరీ యజమాని వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేవు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత నెల 31వ తేదీన భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) జరిగింది. కంజుర్‌మార్గ్ ప్రాంతంలోని గడ్డి భూముల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కంజుర్‌మార్గ్ ప్రాంతంలోని ఖాళీప్రదేశంలో పెద్ద ఎత్తున చెట్లు, పచ్చగడ్డి ఉన్నాయి. ఆ ఖాళీ ప్రదేశంలో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కాసేపట్లోనే ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు కమ్మేశాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం రోడ్డుకు పక్కనే ఉండటంతో.. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. మంటలను ఆర్పేందుకు 6 అగ్నిమాపక వాహనాలు సహాయక చర్యలో పాల్గొన్నాయి.