UP Elections 2022 : నేను హేమామాలినిలా కాకుడదనుకుంటున్నా.. ఆర్ఎల్ డీ చీఫ్ జ‌యంత్ చౌదరి

Published : Feb 02, 2022, 12:45 PM IST
UP Elections 2022 : నేను హేమామాలినిలా కాకుడదనుకుంటున్నా.. ఆర్ఎల్ డీ చీఫ్ జ‌యంత్ చౌదరి

సారాంశం

తాను బీజేపీతో చేరి హేమమాలినిలా కాకుడనుకుంటున్నానని ఆర్ఎల్ డీ చీఫ్ చీఫ్ జ‌యంత్ చౌద‌రి అన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 

UP Election News 2022 : ఇటీవ‌ల కేంద్ర మంత్రి అమిత్ షా (amith sha) ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆర్ఎల్ డీ చీఫ్ జ‌యంత్ చౌద‌రి (jayanth choudari) కౌంట‌ర్ ఇచ్చారు. తాను హేమ‌మాలినిలా కాకుడ‌ద‌నుకుంటున్నాని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా త‌నను బీజేపీతో చేరాల‌ని ఆహ్వానించార‌ని అని చెప్పారు. అయితే తాను ఆ పార్టీలోకి వెళ్తే హేమ‌కు వచ్చిన ప‌రిస్థితే త‌న‌కు కూడా వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. 

మ‌రి కొన్ని రోజుల్లో జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌న మ‌ద్ద‌తు దారుల‌ను ఉద్దేశించి హేమ మాలిని మాట్లాడారు. బీజేపీ (bjp)కి త‌న‌పై ప్రేమ లేద‌ని , తాను హేమా మాలినిగా ఉండాలనుకోవడం లేదని అన్నారు. అనంతరం నూతన వ్యవసాయ బిల్లుల సందర్భంగా మరణించిన రైతుల విషయంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షా పశ్చిమ యూపీలోని జాట్ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జ‌యంత్ చౌద‌రి త‌ప్పుడు ఇంటిని ఎంచుకున్నార‌ని అన్నారు. యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీకి ప్ర‌ధాన పోటీకి నిలుస్తున్న స‌మాజ్ వాదీ పార్టీతో ఆర్ఎల్ డీ పొత్తు కుదుర్చుకుంది. ఈ నేప‌థ్యంలో అమిత్ షా వ్యాఖ్య‌లు చేశారు.  ముఖ్యంగా జనవరి 26వ తేదీన జాట్ నేతలతో అమిత్ షా సమావేశమైన త‌రువాత‌ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ మాట్లాడారు. “ జాట్ కమ్యూనిటీ నాయ‌కులు, ప్ర‌జ‌లు జయంత్ చౌదరితో మాట్లాడాలని మేము సూచించాం. ఆయ‌న కోసం బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.’’ అని అన్నారు. 

జ‌న‌వ‌రి 28వ తేదీన అఖిలేష్ యాద‌వ్, జ‌యంత్ చౌద‌రి సంయుక్తంగా మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. రైతులు బీజేపీ ప‌ట్ల జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించారు. త‌మ కూట‌మి (RLD-SP కూటమి) చాలా ప‌టిష్ట‌మైన‌ద‌ని నొక్కి చెప్పారు. ‘‘ మా సంగమం చాలా ముందుగానే జరిగింది. యూపీ అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. చౌదరి చరణ్ సింగ్ (charan singh) పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము భావిస్తున్నాం. అందుకే కూటమిని ఏర్పాటు చేసుకున్నాం’’ అని ఈ సంద‌ర్భంగా అఖిలేష్ యాద‌వ్ తో ఏర్పరచుకున్నాము" అని అఖిలేష్‌తో చౌదరి జ‌యంత్ చౌద‌రి అన్నారు. 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల‌కు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.మొదటి దశ ఓటింగ్ ఫిబ్రవరి 10వ తేదీని నిర్వ‌హించ‌నున్నారు. రెండో ద‌శ ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన‌, మూడో ద‌శ ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన‌, నాలుగో ద‌శ ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 23వ తేదీన‌, ఐదో ద‌శ ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన‌, ఆరో ద‌శ ఎన్నిక‌లు మార్చి 3వ తేదీన‌, ఏడో ద‌శ ఎన్నిక‌లు మార్చి 7వ తేదీన చేపట్ట‌నున్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?