మహిళా డాక్టర్ కు ఒకేసారి రెండు కరోనా వేరియంట్లు.. భారత్ లో తొలి కేసు...

By AN TeluguFirst Published Jul 21, 2021, 11:21 AM IST
Highlights

రెండు డోసులు కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా ఆ మహిళ డాక్టర్ కు వైరస్ వేరియంట్లు ఆల్ఫా, డెల్టా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి బొర్కాకోటి మాట్లాడుతూ ఈ విధంగా రెండు వేరియంట్లు ఒక వ్యక్తికి సోకిన కేసులు బ్రిటన్, బ్రెజిల్, పోర్చుగల్లో నమోదయ్యాయని, అయితే ఇటువంటి కేసు భారత్లో నమోదవడం ఇదే తొలిసారి అన్నారు.
 
అసోంకు చెందిన ఒక మహిళా డాక్టర్ కు ఒకేసారి కరోనా వైరస్ కు చెందిన రెండు వేరియంట్లు సోకాయి.  దేశంలో ఇటువంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బీ బొర్కాకోటి ఈ విషయాన్ని తెలిపారు.  

రెండు డోసులు కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా ఆ మహిళ డాక్టర్ కు వైరస్ వేరియంట్లు ఆల్ఫా, డెల్టా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి బొర్కాకోటి మాట్లాడుతూ ఈ విధంగా రెండు వేరియంట్లు ఒక వ్యక్తికి సోకిన కేసులు బ్రిటన్, బ్రెజిల్, పోర్చుగల్లో నమోదయ్యాయని, అయితే ఇటువంటి కేసు భారత్లో నమోదవడం ఇదే తొలిసారి అన్నారు.

ఆమెలో ఒకేసారి ఆల్ఫా, డెల్టా రకాలను కనుగొన్నట్లు చెప్పారు. దీంతో మరోసారి నిర్ధారించేందుకు గాను ఆమె శాంపిల్లను రెండోసారి కూడా పరీక్షించినప్పటికీ... అదే విషయం తేలినట్లు వెల్లడించారు.  ఆమె భర్తకు కూడా కోవిడ్ సోకిందని.. ఆయనలో ఆల్ఫా రకాన్ని కనుగొన్నట్లు చెప్పారు.

రెండు డోసుల టీకా తీసుకున్న నెల రోజుల తరువాత ఆ మహిళ డాక్టర్ కు తిరిగి  కరోనా వేరియంట్లు సోకాయి అన్నారు.  ఈ వైద్య దంపతుల జంట కోవిడ్ సెంటర్లో విధులు నిర్వహించారు.  

అయితే వీరిద్దరికీ స్వల్ప లక్షణాలే ఉన్నాయని, అందుకే వీరు హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందొచ్చని ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని డాక్టర్ బుర్కా కోటి తెలిపారు. 

కాగా గతంలో బెల్జియంలో ఓ వృద్ధురాలు (90) లో ఒకేసారి ఆల్ఫా, బీటా వైరస్ రకాలు కనిపించాయి. ఆమెకు వాక్సినేషన్ కాకపోగా ఈ ఏడాది మార్చిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
click me!