
కర్ణాటక : భార్యను హత్య చేసిన భర్త ఆమె అనారోగ్యంతో మృతి చెందిందని నాటకమాడిన ఉదంతం నేలమంగల తాలూకా తోణచిన కొప్పె గ్రామంలో వెలుగుచూసింది. చౌడేశ్ (35), తన భార్య శ్వేత (30)ను హత్య చేశాడు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా ఆలూరు గ్రామానికి చెందిన శ్వేతను తొమ్మిదేళ్ల క్రితం హిరియూరు తాలూకా kurubarahalliకి చెందిన చౌడేశ్ కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. హఠాత్తుగా బుధవారం రాత్రి శ్వేతకు అనారోగ్యంగా ఉందని నేలమంగల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చాడు చౌడేశ్. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. శ్వేత అనారోగ్యంతో మృతి చెందిందని నమ్మించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళగా ఆమె దేహంపై గాయాల గుర్తులు కనబడ్డాయి. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చౌడేశ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో వెలుగుచూసింది. రెండు రోజులు గదిలో బంధించి నరకం చూపించారు. ప్రేమించినట్టు నమ్మించి గది దాకా తీసుకొచ్చినవాడు, అతని స్నేహితులు కలిసి gang rape జరిపారు. ఆ తర్వాత murder చేసి.. గదిలో దూలానికి వేలాడదీసి suicide డ్రామా ఆడారు. గురువారం Sri Sathya Sai Districtలో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంలో పోలీసుల తీరు బాధితుల ఆగ్రహానికి గురైంది. వారి కథనం ప్రకారం… శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణానికి చెందిన విద్యార్థిని (22) తిరుపతిలోని కృష్ణతేజ College of Pharmacyలో మూడో సంవత్సరం చదువుతూ హాస్టల్ లో ఉంటుంది. గోరంట్ల మండలం మల్లాపల్లికి చెందిన సాదిక్ కి, ఆమెకు మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు రోజుల క్రితం ఆమెను కారులో సాదిక్ తీసుకువెళ్ళాడు.
మల్లాపల్లి వద్ద ఉన్న తన గదిలో బంధించి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం జరిపి గురువారం హత్య చేశాడు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇదే కథను పోలీసులకు వినిపించాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పైకప్పుకు కట్టిన చున్నీకి వేలాడుతూ ఆమె మృతదేహం కంటబడింది. వాల్చిన మంచానికి మోకాళ్లు ఆనుతుండటం గమనార్హం. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు పోస్టుమార్టం జరుగుతుండగా అక్కడికి డీస్పీ రమాకాంత్ చేరుకున్నారు.
అక్కడికి వచ్చిన డీఎస్పీ వద్ద తన కుమార్తె మృతి విషయంలో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆత్మహత్యే కావచ్చుననే అర్థం వచ్చేలా ఏదో అనగా ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో గురువారం అర్ధరాత్రివరకు గోరంట్ల పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వారికి నచ్చజెప్పేందుకు డిఎస్పీ అక్కడికి రాగా ఆయనపై బంధువులు విరుచుకుపడ్డారు. ఉదయం 11:30 కు నిందితుడు పోలీసులకు లొంగిపోయినా ఎందుకు బయట పెట్టలేదు అని నిలదీశారు. రీ పోస్టుమార్టం జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అక్కడికి చేరుకుని బాధితుల తరపున పోలీసులతో చర్చించారు.