ఢిల్లీ డిప్యూటీ సీఎంపై ప‌రువు న‌ష్టం దావా వేసిన అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌.. ఎందుకంటే ?

By Sumanth KanukulaFirst Published Jul 1, 2022, 4:02 PM IST
Highlights

ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియాపై పరువు నష్టం కేసు నమోదైంది. దీనిని అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్మ దాఖలు చేశారు. కరోనా సమయంలో పీపీఈ కిట్ల కాంట్రాక్ట్ ను అస్సాం సీఎం తన కుటుంబ సభ్యుల కంపెనీలకు ఇచ్చారని సిసోడియా గతంలో ఆరోపణలు చేశారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ సుప్రీంకోర్టులో క్రిమిన‌ల్ ప‌రువు న‌ష్టం దావా వేశారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో మార్కెట్ ధరలకు మించి పీపీఈ కిట్‌లను అందించడానికి హిమంత బిస్వా శర్మ త‌న భార్య సంస్జల‌కు, కొడుకు బిజినెస్ పార్ట‌న‌ర్ కు అస్సాం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చిందని గత నెలలో ఢిల్లీలో జరిగిన విలేకరుల మ‌నిష్ సిసోడియా ఆరోపించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌పై అస్సాం సీఎం కేసు పెట్టారు. 

అప్పుడు అమిత్ షా నా మాట వినుంటే.. బీజేపీ నేతే సీఎం : ఉద్థవ్ థాక్రే వ్యాఖ్యలు

ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ జూన్ 30వ తేదీన కమ్రూప్ రూరల్ కోర్టులో బిస్వా శ‌ర్మ పరువు నష్టం కేసు దాఖ‌లు చేశారు. అయితే ఈ నేరం రుజువైతే సిసోడియాకు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో జూలై 22వ తేదీన విచార‌ణ జ‌రిపేందుకు కోర్టు ఒప్పుకుంద‌ని సంబంధిత ఏజెన్సీలు తెలిపాయి. ఈ కేసు విష‌యంలో అస్సాం సీఎం త‌రుఫు సీనియ‌ర్ న్యాయ‌వాది దేవజిత్ లోన్ సైకియా వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు. హిమంత బిస్వా శర్మపై సిసోడియా చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆయన అన్నారు. పిపిఐ కిట్‌లను ఉత్పత్తి చేసిన కంపెనీ ఎలాంటి బిల్లుల‌ను పెంచలేద‌ని చెప్పారు.‘‘ ఆ సమయంలో NHM PPE వ్యాపారంలో కిట్‌లను సరఫరా చేయాలని అభ్యర్థించింది. దీంతో వారు తమ CSRలో భాగంగా సుమారు 1500 PPE కిట్‌లను సరఫరా చేసారు. దీనికి  ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ’’ అని ఆయన తెలిపారు. 

జూలై 4న షిండే ప్ర‌భుత్వానికి విశ్వాస పరీక్ష.. 3వ తేదీన స్పీకర్ ఎన్నిక

జూన్ 4వ తేదీన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో సిసోడియా చేసిన నిరాధార ఆరోపణలపై తన క్లయింట్ కేసు పెట్టారని చెప్పారు. అప్పుడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా కూడా ఉన్న సీఎం అత్యవసర కాంట్రాక్టు ఇచ్చారని సిసోడియా ఆరోపించార‌ని తెలిపారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరలకు PPE కిట్‌ల సరఫరా కోసం త‌న త‌రుఫు వారికి కాంట్రాక్ట్ ఇచ్చార‌ని ఎలాంటి రుజువు లేకుండా సిసోడియా ఆరోపణలు చేశార‌ని అన్నారు. ఆరోపణలను ఖండిస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ దావా ఆల‌స్యంగా దాఖ‌లు చేశామ‌ని తెలిపారు. 

అబార్షన్ పిల్ వేసుకున్న ప్రెగ్నెంట్ మైనర్ మృతి.. బాయ్‌ఫ్రెండ్ అరెస్టు

కాగా మనీస్ సిసోడియా ఆరోప‌ణ‌ల‌పై రినికి భుయాన్ శర్మ కూడా గ‌త నెల‌లో కామ్రూప్‌లోని మరో కోర్టులో సిసోడియా నుండి రూ.100 నష్టపరిహారం కోరుతూ సివిల్ పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో జూలై 25న తన ఎదుట హాజ‌రుకావాల‌ని కోర్టు ఢిల్లీ డిప్యూటీ సీఎం ను కోరింది.  ఈ రెండు కేసుల్లో మనీష్ సిసోడియా విచారణ ఎదుర్కోనున్నారు. 
 

click me!