అప్పుడు అమిత్ షా నా మాట వినుంటే.. బీజేపీ నేతే సీఎం : ఉద్థవ్ థాక్రే వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 1, 2022, 3:34 PM IST
Highlights

బీజేపీ మద్ధతుతో శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మీడియా ముందుకు వచ్చారు. అమిత్ షా నాడు తమ ప్రతిపాదనకు అంగీకరించలేదని ఆయన వ్యాఖ్యానించారు. 

గత కొన్నిరోజులుగా అనూహ్య మలుపులు తిరిగి.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తించిన మహారాష్ట్ర సంక్షోభానికి (maharashtra crisis) నిన్నటితో చెక్ పడిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ థాక్రే (uddhav thackeray) సీఎం పదవికి రాజీనామా చేసిన మర్నాడే రెబల్ నేత ఏక్ నాథ్ షిండే (eknath shinde)  , బీజేపీ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలుత దేవేంద్ర ఫడ్నవీస్ (devendra fadnavis ) సీఎం అవుతారని ప్రచారం జరిగినా.. ఏక్ నాథ్ షిండేనే సీఎం అవుతారని స్వయంగా ఫడ్నవీస్ తెలియజేశారు. దీంతో సీఎంగా ఏక్ నాథ్ , డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ లు గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మీడియా ముందుకు వచ్చారు. నాడు అమిత్ షా తన మాటకు కట్టుబడి వుండుంటే బీజేపీ నేత సీఎం పీఠంపై ఉండేవాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయం నాటి ఒప్పందం ప్రకారం తొలి రెండున్నరేళ్లు శివసేన నేత సీఎం అయ్యేందుకు అమిత్ షా ఒప్పుకుని వుంటే... రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేది కాదని థాక్రే వ్యాఖ్యానించారు. 

మరోవైపు కొత్త సీఎం ఏక్ నాథ్ షిండే సోమవారం తన ప్రభుత్వానికి వున్న బలాన్ని నిరూపించుకోవాల్సి వుంది. మూడవ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ముందుగా స్పీకర్ ను ఎన్నుకుని.. తర్వాత విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది షిండే వర్గంలోనే వున్నారని ఆయన వెల్లడించారు. అటు బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు వున్నారు. దీంతో షిండే ప్రభుత్వం సులభంగానే విశ్వాస పరీక్ష గట్టెక్కనుంది. 

ALso REad:ట్విట్ట‌ర్ డీపీ మార్చిన ఏక్ నాథ్ షిండే.. బాలాసాహెబ్ ఠాక్రే వార‌స‌త్వానికి దావా..

ఇకపోతే.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఏకనాథ్ షిండే తన ట్విట్టర్ డీపీని మార్చారు. బాలాసాహెబ్ ఠాక్రే పాదాల దగ్గర కూర్చున్న తన ఫోటోను ప్రొఫైల్ పిక్చ‌ర్ గా సెట్ చేశారు. బాలాసాహెబ్ తో ఉన్న ఫొటో డీపీగా మార్చి మహారాష్ట్ర ప్రజలకు షిండే పెద్ద సందేశం ఇచ్చారు. నిజానికి షిండే మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ బాలాసాహెబ్ హిందుత్వం గురించి పదే పదే మాట్లాడేవారు. మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ఏక్ నాథ్ షిండే సూరత్ ను విడిచిపెట్టిప్పటి నుంచి ఉద్ద‌వ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ తో క‌లిసి అస‌హ‌జ పెట్టుకున్నార‌ని తీవ్రంగా ఆరోపించారు. బాలాసాహెబ్ ఠాక్రే ఆలోచనలు, హిందుత్వంతో ఉద్ద‌వ్ ఠాక్రే రాజీ ప‌డ్డార‌ని విమ‌ర్శించారు. బాలాసాహెబ్ ఎప్పుడూ కాంగ్రెస్, ఎన్సీపీకి వ్యతిరేకంగా పోరాడేవారని, అయితే ఉద్ధవ్ వారితోనే చేతులు క‌లిపార‌ని షిండే చెప్పారు. 

కాగా ఏక్ నాథ్ షిండే త‌న వర్గాన్ని నిజ‌మైన శివ‌సేన‌గా, తామే శివ‌సైనికుల‌మని ప‌దే ప‌దే ప్ర‌క‌టించుకున్నారు. తామే బాలాసాహెబ్ సూత్రాలను పాటిస్తున్నామ‌ని అన్నారు. శివసేనకు బీజేపీతో సహజంగానే పొత్తు ఉందని, మరే ఇతర పార్టీతో పొత్తుపెట్టుకోవ‌డం అంటే బాలాసాహెబ్ ఆలోచనలకు దూరంగా ఉండడమేనని షిండే ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూ వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ డీపీ మార్చ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ ఫొటో పెట్ట‌డం ద్వారా తామే బాల‌సాహెబ్ కు అస‌లైన వారసులం అనే వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా పంపించారని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. 

click me!