
కర్ణాటలో ముందుశ్రేణిలో ఉన్న ఏషియానెట్ సువర్ణ న్యూస్‌కు అవార్డుల పంట పండింది. ప్రముఖ ఎక్స్‌చేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అవార్డుల కార్యక్రమం(ఈఎన్‌బీఏ అవార్డులు 2023)లో ఏషియానెట్ సువర్ణ న్యూస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముక్కు సూటిదనం, తెగువ, అవిరామం అనే ట్యాగ్‌లైన్ గల ఈ చానెల్ తన అద్భుతమైన కృషితో అపూర్వ ఫలితాలు సాధించుకుంది. నాణ్యమైన వార్తలు, సమాచారాన్ని ప్రేక్షకులకు అందించిన ఈ చానెల్ భిన్న విభాగాల్లో చేసిన కృషికి, పాత్రికేయ పనికి గుర్తింపు లభించింది.
విస్తృత స్థాయిలో అంశాలను కవర్ చేసిన ఈ నెట్‌వర్క్‌కు పలు విభాగాల్లో గుర్తింపు దక్కింది. అందుకు అనుగుణంగా పలు కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. కన్నడ ప్రేక్షకుల మనస్సు దోచుకుని, విలువైన సమాచారాన్ని అందించిన ఏషియానెట్ సువర్ణ చానెల్‌కు తొమ్మిది అవార్డులు లభించాయి. అవి ఇలా ఉన్నాయి.
1. బెస్ట్ ఎర్లీ ప్రైమ్ షో: ‘సినిమా హంగామా’ (సాయంత్రం 6.30 గంటలకు ప్రసారమవుతుంది)
2. బెస్ట్ లేట్ ప్రైమ్ షో: ‘ప్రైమ్ న్యూస్’ (రాత్రి 10 గంటలకు ప్రసారం)
3. బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ షో: ‘బిగ్ 3’ (ఉదయం 9 గంటలకు ప్రసారం)
4. బెస్ట్ ఇన్‌డెప్త్ సిరీస్: ‘కవర్ స్టోరీ’ (ప్రతి శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం)
5. బెస్ట్ న్యూస్ కవరేజీ: ‘యాదగిరికి నీటి కోసం రూ. 2,054 కోట్ల విడుదల’
6. బెస్ట్ యాంకర్: అజిత్ హనుమక్కనవర్
7. బెస్ట్ కరెంట్ అఫైర్స్: ‘లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్’ మురుగ శ్రీ రేప్ కేసు
8. బెస్ట్ ప్రైమ్ షో: ‘న్యూస్ అవర్’ (రాత్రి 8.30 గంటలకు ప్రసారం)
9. బెస్ట్ క్యాంపెయిన్ ఫర్ సోషల్ కాజ్: ‘వన్యప్రాణుల సంరక్షణ’
విభిన్న రుచులు గల ప్రేక్షకుల కోసం ఏషియానెట్ సువర్ణ న్యూస్ భిన్నమైన కార్యక్రమాలను ఆఫర్ చేస్తున్నది. ‘సినిమా హంగామా’ చిత్ర పరిశ్రమలోని తాజా వార్తలు, స్టార్లు, ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. యశ్, సుదీప్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ వంటి సెలెబ్రిటీల ఇంటర్వ్యూల వంటి కార్యక్రమాలతో వ్యూయర్లను ఆకట్టుకుంటున్నది.
‘ప్రైమ్ న్యూస్’ జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న ముఖ్యమైన పరిణామాలను, ఆ రోజు జరిగిన ముఖ్యమైన విషయాలను, సంఘటనలను ఏరోజుకారోజు ప్రేక్షకులకు అందిస్తున్నది.
Also Read: తెలంగాణలో ఒంటరిపోరే: బీజేపీ నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం
‘బిగ్ 3’ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిల్లోని విషయాలు, సమస్యలపై చర్చించి అవసరమైన వారిని అనుసంధానించి పరిష్కారం చూపే దిశగా సాగుతున్నది. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లోని సమస్యలను ఎత్తి చూపుతూ పరిష్కారానికి దోహదం చేస్తున్నది. ఈ కార్యక్రమం పలు సమూహాలకు ప్రయోజనాలు చేకూర్చింది. కర్ణాటక పౌరుల ఈ ప్రోగ్రామ్‌ను అక్కున చేర్చుకున్నారు.
‘కవర్ స్టోరీ’ అవినీతి, అక్రమాలు, అన్యాయాలను ఎత్తిచూపడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. పరిశోధనాత్మక రీతిలో ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాజెక్టుల్లోని లోపాలపై ఫోకస్ పెడుతుంది. తద్వార అనేక మంది అవినీతి అధికారులు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు.
‘సేవ్ వైల్డ్‌లైఫ్’ కార్యక్రమంతో ప్రత్యేకమైంది. గత మూడేళ్లుగా ఏషియానెట్ సువర్ణ న్యూస్ వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడుతూనే ఉన్నది. ఈ ప్రోగ్రామ్‌తో ఫారెస్ట్ ఫీల్డ్ స్టాఫ్ కృషిని గుర్తించడంలో, ఫారెస్ట్ ఫ్రెండ్లీ ఆచరణను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి ఉపకరిస్తున్నది. ఈ కార్యక్రమం ఫోర్త్ సీజన్‌ను అప్పటి సీఎం, దక్షిణ భారత వెర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ప్రారంభించారు. శ్రీ మురళి, శృతి నాయుడులు ఈ ప్రోగ్రామ్‌కు అంబాసిడర్లుగా ఉన్నారు.
ఈ కార్యక్రమం ప్రముఖ ప్రభావం వేసింది.
1. ఫారెస్ట్ ఫీల్డ్ స్టాఫ్ కోసం సీఎం గోల్డ్ మెడల్‌ను ఈ కార్యక్రమం మూలంగానే తొలిసారి ఏర్పాటు చేశారు.
2. బెస్ట్ ఫారెస్ట్ ఫ్రెండ్లీ పంచాయతీల్లో రూరల్ ఆర్‌వో ప్లాంట్‌లు శాంక్షన్ అయ్యాయి.
3. డీఆర్ఎఫ్‌వో జీతాల్లో తారతమ్యాలను తొలగించి, కొత్త వేతన విధానం అమల్లోకి వచ్చింది.
2022 ఈఎన్‌బీఏ అవార్డుల కార్యక్రమంలో సువర్ణ న్యూస్ నాలుగు అవార్డులను పొందింది. న్యూస్ యాంకర్ జయప్రకాశ్ శెట్టి, బెస్ట్ కరెంట్ అఫైర్స్ కేటగిరీ, బెస్ట్ న్యూస్ కేటగిరీ, సువర్ణ న్యూస్ కవర్ స్టోరీకి సువర్ణ న్యూస్ అవార్డులు పొందింది.
ఏషియానెట్ సువర్ణ న్యూస్ గురించి:
ఏషియానెట్ సువర్ణ న్యూస్ కన్నడ న్యూస్ చానెల్. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ యాజమాన్యంలో ఇది నడుస్తున్నది. ఈ మీడియా సబ్సిడరీ జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఛత్రం కింద ఆపరేట్ చేస్తున్నది. 2008 మార్చి 31వ తేదీన ఈ చానెల్ ప్రారంభమైంది. కన్నడ భాషలో మూడో వార్తా చానెల్‌గా ప్రారంభమైంది.