ఫెర్టిలైజర్ స్కామ్‌పై బీజేపీ ఆరోపణలు:ఆశోక్ గెహ్లాట్ సోదరుడి సంస్థలపై ఈడీ సోదాలు

By narsimha lodeFirst Published Jul 22, 2020, 12:09 PM IST
Highlights

రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రేసన్ గెహ్లాట్ సంస్థలపై బుధవారం నాడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.


న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రేసన్ గెహ్లాట్ సంస్థలపై బుధవారం నాడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఫెర్టిలైజర్ స్కామ్ లో అగ్రేషన్  గెహ్లాట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆశోక్ గెహ్లాట్ తో పాటు ఆయన సోదరుడు అగ్రేసన్ గెహ్లాట్ లు సబ్సిడీ ఫెర్టిలైజర్ ను విదేశాలకు ఎగుమతి చేశారని బీజేపీ ఆరోపించింది.

also read:సచిన్ పైలెట్ వర్గానికి ఊరట: ఈ నెల 24 వరకు చర్యలొద్దని హైకోర్టు ఆదేశం

2007 నుండి 2009 మధ్య కాలంలో ఈ ఎరువులను ఎగుమతి చేశారని 2017 నవంబర్ మాసంలో బీజేపీ ఆరోపించింది. ఈడీ అధికారులు ఇవాళ  దేశంలోని పలు చోట్ల దాడులు నిర్వహించినట్టుగా సమాచారం.

అగ్రసేన్ గెహ్లాట్ నడుపుతున్న సంస్థకు సబ్సిడీ ఎరువులు, పొటాష్ ను విదేశాలకు ఎగుమతి చేసింది. విదేశాలకు వీటిని ఎగుమతి చేయడం నిషేధించిందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. 

సచిన్ పైలెట్ వర్గం తిరుగుబాటుతో ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు ఆశోక్ గెహ్లాట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో  ఈడీ సోదాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.


 

click me!