'ఆ హంతకులు ఉగ్రవాదులే .. వారిపై ఉపా చట్టం ప్రయోగించాలి': AIMIM చీఫ్  ఒవైసీ 

Published : Apr 21, 2023, 06:26 PM IST
'ఆ హంతకులు ఉగ్రవాదులే .. వారిపై ఉపా చట్టం ప్రయోగించాలి': AIMIM చీఫ్  ఒవైసీ 

సారాంశం

అతిక్ అహ్మద్,అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్య తర్వాత యూపీ  రాజకీయాలు వేడెక్కాయి. అసదుద్దీన్ ఒవైసీ పదే పదే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో మాఫియా డాన్, ఎంపీ అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను ముగ్గురు దుండగులు పోలీసుల ముందే హతమార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ హత్యాకాండపై అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో యోగి సర్కార్ పై తరుచు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడంతో  యూపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడుతున్నారు. ఈ విషయమై ఒవైసీ మరోసారి యూపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ  మీడియాతో మాట్లాడుతూ..గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ను చంపిన వారిపై  చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద అభియోగాలు మోపడంలో కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు వైఫల్యమయ్యాయని  విమర్శించారు.  వారిపై ఎందుకు UAPA విధించలేదు? 8 లక్షల విలువైన ఆయుధాన్ని ఎవరు ఇచ్చారు? వీరు తీవ్రవాదులా? వారు గాడ్సే అడుగుజాడల్లో నడుస్తున్నారా ? అని ప్రశ్నించారు. పోలీసుల కస్టడీలో ఉన్న అతిక్ , అతని సోదరుడు అష్రఫ్‌ను హతమార్చిన ముష్కరులపై అధికారులు ఒక్క బుల్లెట్ కూడా కాల్చలేదని, యుపి పోలీసులు ఏం చేస్తున్నారని  ఆయన విమర్శించారు. పాలకుల తీరుతో సంతోషంగా లేరన్నారు.

అరే, మన దేశంలో చేతికి సంకెళ్లు ఉన్నవారిని, పోలీసుల అదుపులో ఉన్నవారిని చంపుతున్నారని, వారిపై కాల్పులు జరిపినప్పుడూ చుట్టూ ఉన్న పోలీసులు ఉన్న ఒక్క బుల్లెట్ కూడా కాల్చలేదని అన్నారు. పోలీసులు బరాత్ (పెళ్లి ఊరేగింపు)కి వచ్చినట్లు చూస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలోని నకిలీ రాజు (ప్రధాని మోడీ)ను అడగాలనుకుంటున్నాం.. ఉత్తరప్రదేశ్ మహారాజ్‌ని అడగాలనుకుంటున్నాం.. దేశంలో ఏం జరుగుతుందో చెప్పండని ప్రశ్నించారు. బుల్లెట్‌కి బుల్లెట్‌తోనే సమాధానం చెప్పుతారా అని ప్రశ్నించారు.  

ఒవైసీ ప్రశ్న

"కాల్పుల్లో ఉపయోగించిన తుపాకీ విలువ ఎనిమిది లక్షలు. మీడియా వాళ్లు కాల్పులు జరిపిన వాళ్ల  ఇంటికి వెళ్తే.. ఒకరి తల్లి గుడిసెలో ఉంటుంది. మరొకరు తల్లిదండ్రులు వేరే వారి వద్ద పనిచేస్తున్నారు. ఇంతకీ వారికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ? 16 లక్షల విలువైన ఈ ఆయుధం ఎవరు ఇచ్చారు?" అని ప్రశ్నించారు.

AIMIM చీఫ్ ఇంకా మాట్లాడుతూ.. “ హంతకులు గాడ్సే అక్రమ సంతానమనీ, ఎందుకంటే గాడ్సే గాంధీని కాల్చాడు. వారు కూడా  గాడ్సే వారసులేనని , హంతకులు టెర్రర్ సెల్‌లో శిక్షణ పొందారని అన్నారు.  ఒవైసీపై ఎందుకు కాల్పులు జరిపారని  మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఓవైసీని చంపి ఫేమస్ కావాలనుకున్నామని వారు భావించారు. ఇది ఫేమస్ అవ్వడం కాదు. వారు టెర్రర్ సెల్ చెందిన వారని అన్నారు. నన్ను మళ్ళీ చంపడానికి ప్రయత్నించవచ్చు కానీ, వారిని పట్టించుకోలేదనీ, 'అల్లానే తనని రక్షించాడని అన్నారు.  

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్