ఆర్యన్ ఖాన్‌ బెయిల్ విచారణ వాయిదా.. ఎల్లుండి వరకు బెయిల్ రాకుంటే..!

By telugu teamFirst Published Oct 27, 2021, 7:46 PM IST
Highlights

ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ మరోసారి వాయిదా పడింది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, మున్‌మున్ దమేచాల బెయిల్ దరఖాస్తులపై వాదనలు విన్న బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విచారణను రేపు మధ్యాహ్నం 2.30కు వాయిదా వేసింది. ఎన్‌డీపీఎస్ స్పెషల్ కోర్టు, సెషన్స్ కోర్టులు ఇప్పటికే ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీపావళి సెలవుల కారణంగా ఎల్లుండి లోగా ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించకుంటే వచ్చే నెల 15వ తేదీ వరకు జైలులో ఉండాల్సి ఉంటుంది. 
 

ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ Shah Rukh Khan తనయుడు Aryan Khan బెయిల్ విచారణ మరో రోజుకు వాయిదా పడింది. రెండు రోజులుగా ఆర్యన్ ఖాన్ Bailపై Bombay High Courtలో వాదనలు జరుగుతున్నాయి. తాజాగా, ఈ విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ ప్రారంభమవుతుంది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, మున్‌మున్ దమేచాల బెయిల్ అప్లికేషన్‌లపై జస్టిస్ నితిన్ డబ్ల్యూ సాంబ్రే సింగిల్ బెంచ్ వాదనలు వింటున్నది.

ఆర్యన్ ఖాన్ 20 రోజులుగా జైలులో ఉంటున్నారు. ఆయనకు రేపు లేదా ఎల్లుండి బెయిల్ వస్తే బయటకు వస్తారు. లేదంటే మరో వచ్చే నెల 15వ తేదీ వరకు జైలులోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు, ఎల్లుండి తర్వాత కోర్టుకు సెలవులు ప్రారంభం కానున్నాయి. శనివారం, ఆదివారాలు కోర్టుకు సెలవులే. బాంబే హైకోర్ట దివాలీ వెకేషన్ నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ నెల 12వ తేదీ వరకు సెలవులున్నాయి. అయితే, కాకతాళీయంగా 13వ తేదీ, 14వ తేదీలు శని, ఆదివారాలు అవుతున్నాయి. దీంతో 14వ తేదీ వరకు సెలవులే ఉండనున్నాయి. మళ్లీ 15వ తేదీ బాంబే హైకోర్టు తెరుచుకోనుంది.

Also Read: ఔను.. సమీర్ వాంఖడే బ్లాంక్ పేపర్స్‌పై నా సంతకాలూ తీసుకున్నాడు.. మరో సాక్షి ఆరోపణలు

నేటి వాదనల్లో భాగంగా ఆర్యన్ ఖాన్, అర్బాజ్ ఖాన్‌లను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని న్యాయవాది అమిత్ దేశాయ్ అన్నారు. ఏడాది శిక్షకాలముండే నేరానికి తమ క్లయింట్లపై కఠిన నిబంధనలు విధించవచ్చునని, కానీ, జైలులో ఉంచడానికి వీల్లేదని వాదించారు. అసలు అక్కడ ఒక కుట్రే లేదని స్పష్టమవుతున్నదని వివరించారు. ఆ నిందితుల మధ్య వాట్సాప్ చాట్ లేదని, కాల్స్ కూడా లేవని, వారు అనుకోకుండా క్రూజ్‌లో కలిశారని, అలాంటప్పుడు అది కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. అలాంటి వాట్సాప్ చాట్ ఆధారంగా వారిని జైలులో పెట్టడం సరికాదని వాదించారు. ఎన్‌సీబీ చూపెడుతున్న వాట్సాప్ చాట్ కొన్నేళ్ల కిందటివని, వాటితో తాజా ఘటనకు సంబంధమే లేదని అన్నారు.

ఎన్‌సీబీ ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌ను ఏ1గా, ఆయన ఫ్రెండ్ అర్బాజ్ ఖాన్‌ను ఏ2గా పరిగణిస్తున్నది.

Also Read: అరేబియా సముద్రంలో డ్రగ్స్‌తో క్రూయిజ్ షిప్.. ఎన్‌సీబీ అదుపులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు

నేడు హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. అసలు అరెస్టు చేయడానికి గల కారణాలు తెలుపకుండా ఎలా జైలులో ఉంచుతారని ప్రశ్నించారు. ఆర్టికల్ 22 కల్పిస్తున్న అరెస్టు మినహాయింపులను, కొన్ని కేసుల్లో నిర్బంధాలు అక్కర్లేని విషయాలనూ ఆయన వివరించారు. వారిదగ్గర ఫోన్ ఉన్నది. వాట్సాప్ చాట్‌ల ఏమున్నదో వారే మీకు వివరించాలని తెలిపారు. తన దగ్గర అవేమీ లేవని, అందుకే వారు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వాదించారు. అసలు డ్రగ్స్ దొరికినవారిని అరెస్టు చేయకుండా ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేయడం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని అన్నారు.

ముంబయి తీరంలో ఓ క్రూజ్ షిప్‌లో ఎన్‌సీబీ తనిఖీలు చేసింది. ఇందులో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన ఎన్‌సీబీ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, ఆయన ఫ్రెండ్ అర్బాజ్ ఖాన్, మున్ మున్ దమేచా సహా పలువురిని అరెస్టు చేసింది.

click me!