అరవింద్ కేజ్రీవాల్ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

By Rajesh Karampoori  |  First Published Mar 10, 2024, 2:29 AM IST

Arvind Kejriwal: ఊహాకందని విజయాన్ని సాధించిన అసామాన్యుడు. ఎలాంటి రాజకీయ వారసత్వం లేని అధికారం చేపట్టిన నాయకుడు . ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి అవినీతికి వ్యతిరేకంగా పోరుబాటపట్టారు. అన్నా హాజరే బృందంతో పనిచేసి ఆనక రాజకీయాల్లోకి వచ్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఢిల్లీ పీఠాన్ని అధిష్టించారు. నిజమైన ప్రజాస్వామ్యానికి జవసత్వాలు నింపాడు. అతడే.. అరవింద్ కేజ్రీవాల్.


Arvind Kejriwal Biography: 

అరవింద్ కేజ్రీవాల్ బాల్యం, విద్యాభ్యాసం

Latest Videos

అరవింద్ కేజ్రీవాల్.. హర్యానాలోని భివానీ జిల్లా సివానీ అనే మారుమూల గ్రామంలో 16 ఆగస్టు 1968న జన్మించాడు. చిన్నప్పటి నుండి తెలివైన విద్యార్థి. అరవింద్ మొదటి ప్రయత్నంలోనే  పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటి ఖరగ్‌పూర్‌లో ప్రవేశం పొందాడు. అతను మెకానికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత.. టాటా స్టీల్‌లో ఉద్యోగం సంపాదించాడు, కానీ, సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ కావాలని వెంటనే ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ఇలా 1993లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుడై కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో చేరాడు. 1995లో తన 1993 IRS బ్యాచ్‌మేట్ అయిన సునీతను వివాహం చేసుకున్నాడు.

నకిలీ రేషన్ కార్డు కుంభకోణాన్ని బహిర్గతం చేయడానికి 1999లో 'పరివర్తన్' అనే ఉద్యమాన్ని స్థాపించి, ఆదాయపు పన్ను, విద్యుత్, ఆహార రేషన్‌కు సంబంధించిన విషయాలలో ఢిల్లీ పౌరులకు సహాయం చేసినప్పుడు సామాజిక ఉద్యమాన్ని చేపట్టారు.  ఈ క్రమంలో 2006లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. 

2010 ప్రారంభంలో జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం ప్రచారం చేస్తున్నప్పుడు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేతో కలిసి పనిచేయడంతో కేజ్రీవాల్ కు ప్రజాదరణ పెరిగింది. భారతదేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయం చేయాలా వద్దా అనే విషయంలో అన్నా హజారేతో ఆయనకున్న విభేదాలు రావడంతో ఆ ఉద్యమం నుంచి వైదొలిగాడు.  

అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ జీవితం

>> అన్నా హజారే ఆధ్వర్యంలో 2011 నుండి జన్ లోక్‌పాల్ బిల్లును డిమాండ్ చేస్తూ పోరాటం చేశారు కేజ్రీవాల్, కానీ, అన్నా హజారే తో విభేదాలు రావడంతో ఆ ఉద్యమం నుంచి వైదొలిగారు. 

>> అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా  ప్రజాదరణ పొందిన ఉద్యమాన్ని చేయాలా? వద్దా? అనే సమయాన.. 26 నవంబర్ 2012న ఆమ్ ఆద్మీ పార్టీని అధికారికంగా  ప్రారంభించారు.  

>> కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఎన్నికల అరంగేట్రం చేసింది. ఆ ఎన్నికల్లో 70 సీట్లకు 28 గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ సమయంలో  ఆమ్ ఆద్మీ పార్టీకి భారత జాతీయ కాంగ్రెస్ నుండి షరతులతో కూడిన మద్దతు లభించడంతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

>> అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా 28 డిసెంబర్ 2013న ప్రమాణ స్వీకారం చేశారు. కానీ లోక్ పాల్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడంతో అధికారం చేపట్టిన కేవలం 49 రోజుల్లోనే సీఎం కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేశారు. 

>> 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీ చేసి దాదాపు 3,70,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

>> 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీని అఖండ విజయం సాధించింది. ఢిల్లీ ప్రజలు ఏకపక్షంగా ఓటు వేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్క్రీన్ చేసింది 70 అసెంబ్లీ స్థానాలు గాను 67 స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు.  14 ఫిబ్రవరి 2015న ఢిల్లీకి రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

>> 2020లో ఢిల్లీకి జరిగిన శాసనసభ ఎన్నికలలో కూడా 70 స్థానాలకు 62 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారు 
 
>> 2022లో పంజాబీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పోటీ చేసింది. అక్కడ 117 స్థానాలకు 92 స్థానాలను ఆమ్ ఆద్మీ కైవసం చేసుకుంది.  తమ పార్టీ అభ్యర్థి భగవత్ మాన్సింగ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

పూర్వ చరిత్ర

>> అరవింద్ కేజ్రీవాల్ 1989లో ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.

>> 1993లో  సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో చేరాడు.

>> 1995లో  IRS అధికారి సునీతను వివాహం చేసుకున్నాడు.

>> 1999లో విద్యుత్తు, ఆదాయపు పన్ను, ఆహార రేషన్లకు సంబంధించిన విషయాలలో పౌరులకు సహాయం చేయడానికి కేజ్రీవాల్ ’పరివర్తన్’ అనే NGOని స్థాపించారు.

>> 2006లో ఆదాయపు పన్ను శాఖలో జాయింట్ కమీషనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, 'పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్' అనే ఎన్జీవోను స్థాపించారు.

>> 2012లో అవినీతి, భారత ప్రజాస్వామ్య స్థితిపై ’స్వరాజ్’ అనే పుస్తకాన్ని ప్రచురించాడు.

అరవింద్ కేజ్రీవాల్ అవార్డులు, విజయాలు

  • 2004: అశోక ఫెలో, సివిక్ ఎంగేజ్‌మెంట్
  • 2005: సత్యేంద్ర కె దూబే మెమోరియల్ అవార్డు (IIT కాన్పూర్ పాలనలో పారదర్శకతను తీసుకురావడానికి చేసిన ప్రచారానికి)
  • 2006: ఎమర్జెంట్ లీడర్‌షిప్ కోసం రామన్ మెగసెసే అవార్డు 
  • 2006: పబ్లిక్ సర్వీస్‌లో CNN-IBN ఇండియన్ ఆఫ్ ది ఇయర్
  • 2009: విశిష్ట నాయకత్వానికి విశిష్ట పూర్వ విద్యార్థుల పురస్కారం (IIT ఖరగ్‌పూర్)
  • 2009: అసోసియేషన్ ఫర్ ఇండియాస్ డెవలప్‌మెంట్ ద్వారా గ్రాంట్ , ఫెలోషిప్ లభించింది.
  • 2010: ఎకనామిక్ టైమ్స్ పాలసీ - ఏజెంట్ ఆఫ్ ది ఇయర్

అరవింద్ కేజ్రీవాల్ బయోడేటా 

పూర్తి పేరు: అరవింద్ కేజ్రీవాల్
పుట్టిన తేదీ:  16 ఆగస్టు 1968
పుట్టిన ప్రదేశం:  సివానీ, భివానీ జిల్లా, హర్యానా, భారతదేశం
పార్టీ పేరు:  ఆమ్ ఆద్మీ పార్టీ
ఎడ్యుకేషన్:  గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్
తండ్రి పేరు:  గోవింద్ రామ్ కేజ్రీవాల్
తల్లి పేరు:  గీతాదేవి
జీవిత భాగస్వామి:  సునీతా కేజ్రీవాల్
మతం:  హిందూ
శాశ్వత చిరునామా:  87 బ్లాక్, బి.కె.దత్ కాలనీ న్యూ ఢిల్లీ-110001
ప్రస్తుత చిరునామా:  బంగ్లా నెం. 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్, సివిల్ లైన్స్, ఢిల్లీ.
ఇ-మెయిల్:  parivartanindia@gmail.com
వెబ్‌సైట్:  http://aamaadmiparty.org/


 
ఆసక్తికరమైన సమాచారం

అరవింద్ కేజ్రీవాల్ సింప్లిసిటీని కోరుకుంటారు.  బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అభిమాని. అతనికి కామెడీ సినిమాలు చూడడం ఇష్టం. తన పనులన్నీ తానే చేసుకోవడం ఇష్టం. తన కార్యాలయంలో కూడా, అతను ప్యూన్ల సేవను ఉపయోగించడానికి నిరాకరించాడు. వ్యక్తిగతంగా తన డెస్క్‌ను శుభ్రం చేశాడు. కేజ్రీవాల్ తన పిల్లల పుట్టినరోజులను జరుపుకోరు.

click me!