యోగి ఆదిత్యనాథ్ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్ & మరిన్ని

By Rajesh Karampoori  |  First Published Mar 10, 2024, 12:32 AM IST

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆయనో ప్రభంజనం. ప్రతికూలతలను అధిగమిస్తూ బీజేపీని వరుసగా రెండోసారి అధికారంలోకి తెచ్చాడు. ఆయననే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌. ఆయన ఆధ్యాత్మికతకు, రాజకీయాలకు కేంద్రబిందువు. తాను విశ్వసించిన వాటి కోసం ఎంత దూరమైన, ఏదైనా చేయగల సమర్థుడు. ఈ క్రమంలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాశారు. అటువంటి ఆయన జీవిత ప్రస్థానం మీకోసం...


Yogi Adityanath Biography:


యోగి ఆదిత్యనాథ్ బాల్యం:

Latest Videos

యోగి ఆదిత్యనాథ్‌గా దేశ ప్రజానీకానికి సుపరిచుతులైన ఆయన అసలు పేరు అజయ్‌ మోహన్‌ సింగ్‌ బిష్త్‌. ఆయన  5 జూన్ 1972న ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌లోని పంచూర్ గ్రామంలో జన్మించారు. యోగి జీ అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిష్త్, ఆయన దీక్ష తర్వాత ఆయనకు యోగి ఆదిత్యనాథ్ అని పేరు పెట్టారు. అతను క్షత్రియ కుటుంబానికి చెందినవాడు. ఆయన తండ్రి పేరు ఆనంద్ సింగ్ బిష్త్, అతడు ఫారెస్ట్ రేంజర్, తల్లి పేరు సావిత్రి దేవి. 2020 సంవత్సరంలో యోగి తండ్రి దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో మరణించారు. సీఎం యోగికి ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. యోగి ఆదిత్యనాథ్ బ్రహ్మచారి, అతను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.

యోగి ఆదిత్యనాథ్ విద్యాభ్యాసం:

>> 1977లో తెహ్రీలోని గజా లోకల్ స్కూల్‌లో తన చదువును ప్రారంభించి 1987లో పదో తరగతి పాసయ్యాడు. ఆ తరువాత 1989లో యోగి జీ రిషికేశ్‌లోని శ్రీ భారత్ మందిర్ లో ఇంటర్ చదివారు.

>> గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు కొన్నాళ్లు భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ)తో ఉన్నప్పటికీ ఆ రాజకీయాలతో పొసగని అజయ్‌ హిందుత్వ సిద్థాంతానికి ఆకర్షితులయ్యారు. ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ఏబీవీపీలో చేరారు. 

>> 1990లో ఆయన ఆల్ ఇండియా కౌన్సిల్‌లో చేరాడు. దీనితో పాటు అతను 1992 సంవత్సరంలో హేమవంతి నందన్ బహుగుణ గర్వాల్ విశ్వవిద్యాలయం నుండి గణితంలో B.Sc. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కోట్‌ద్వార్‌లో చదువుతున్నప్పుడు.. అతని గదిలో దొంగతనం జరిగింది. ఈ సమయంలో అతని అన్ని వస్తువులు, స్టడీ సర్టిఫికెట్స్ దొంగిలించబడ్డాయి. దీని కారణంగా అతను గోరఖ్‌పూర్ నుండి సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడంలో విఫలమయ్యాడు.

>> దీని తరువాత.. అతను సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం రిషికేశ్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. కానీ, రామమందిర ఉద్యమం కారణంగా అతని దృష్టి విడిపోయింది. ఎంఎస్సీ చదువుతున్న సమయంలో గురు గోరఖ్‌నాథ్‌పై పరిశోధన చేసేందుకు 1993లో గోరఖ్‌పూర్ వచ్చారు.

>> ఈ సమయంలో అతను గోరఖ్‌పూర్‌లోని తన మేనమామ మహంత్ ఇలాల్ నాథ్ ఆశ్రయానికి వెళ్లి అతనిచే దీక్షను పొందాడు. ఆ తర్వాత 1994లో పూర్తి సన్యాసి అయ్యాడు. అప్పటి వరకూ అజయ్‌ మోహన్‌ సింగ్‌ బిష్త్‌గా ఉన్న ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్‌గా మారింది. ఆ తరువాత యోగి జీని ఆలయ పీఠాధీశ్వరునిగా చేశారు.

యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితం

>> యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా1998లో గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు.  

>> ఆ సమయంలో అతని వయస్సు కేవలం 26 సంవత్సరాలు.  అతి పిన్న వయస్కుడైన ఎంపీ గా రికార్డు క్రియేట్ చేశారు. దీంతో 1999లో మరోసారి గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

>> 1998 నుండి 1999 వరకు  ఆహారం, పౌర సరఫరాలు ప్రజా పంపిణీపై స్టాండింగ్ కమిటీ సభ్యునిగా పనిచేశాడు. ఇది కాకుండా హోం మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడుగా కూడా పనిచేశారు.

>> హిందూ యువ వాహినిని యోగి 2002 ఏప్రిల్ నెలలో స్థాపించారు.

>> అదే నియోజకవర్గం నుండి 2004 (14వ లోక్‌సభకు) మూడవసారి తిరిగి ఎన్నికయ్యారు. ఈ సమయంలో హోం మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడుగా పనిచేశారు.

>> 2009లో ( 15వ లోక్‌సభకు) 4వసారి తిరిగి ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో 2 లక్షలకు పైగా ఓట్లతో గెలిచి లోక్‌సభకు చేరుకున్నారు. 31 ఆగస్టు 2009 నుంచి ఆయన  రవాణా, పర్యాటకం, సంస్కృతి స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడుగా వ్యవహరించారు.

>> 2014లో ( 16వ లోక్‌సభకు) 5వసారి బంపర్‌ మెజార్టీ ఓట్లతో గెలిచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాజమతి నిషాద్‌పై విజయం సాధించారు.

>> 2014 ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది. కానీ, ఆ తర్వాత 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా యోగి విజయం సాధించలేకపోయారు.

>> 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధిష్టానం..  యోగి ఆదిత్యనాథ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయించింది, అందు కోసం ఆయనకు ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేశారు. దీనితో పాటు.. మార్చి 19, 2017 న జరిగిన యుపి బిజెపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో యోగి ఆదిత్యనాథ్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుని, ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు.

>> 2022  పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి ఇది తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ అర్బన్ ప్రాంతం నుండి పోటీ చేసి లక్షకు పైగా ఓట్లతో గెలిచి 25 మార్చి 2022న మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు.

వివాదాలు

7 సెప్టెంబర్ 2008న అజంగఢ్‌లో జరిగిన ఘోరమైన హింసాత్మక దాడిలో యోగి జీపై దాడి చేశారు. ఈ దాడి నుండి తృటిలో తప్పించుకున్నాడు. ఈ దాడి చాలా పెద్దది, దాడి చేసినవారు వందకు పైగా వాహనాలను చుట్టుముట్టారు. ఈ దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. గోరఖ్‌పూర్ అల్లర్ల సమయంలో ముహర్రం సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ హిందూ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో యోగి ఆదిత్యనాథ్‌ను అరెస్టు చేశారు.


యోగి ఆదిత్య నాధ్ ప్రొఫైల్

పూర్తి పేరు: అజయ్ మోహన్ సింగ్ బిష్త్
పుట్టిన తేది:    05 జూన్ 1972 (వయస్సు 51)
జన్మస్థలం: పంచూర్, పౌరీ గర్వాల్
పార్టీ పేరు: భారతీయ జనతా పార్టీ
చదువు: ఉన్నత విద్యావంతుడు
తండ్రి పేరు: ఆనంద్ సింగ్ బిష్త్
తల్లి పేరు: సావిత్రి దేవి
మతం: హిందూ
బ్రహ్మాచారి
శాశ్వత చిరునామా: 361ఓల్డ్ గోరఖ్‌పూర్, P.S. & P.O.- గోరఖ్‌పూర్, తహసీల్ సదర్ బజార్, జిల్లా- గోరఖ్‌పూర్
ప్రస్తుత చిరునామా:     5, కాళిదాస్ మార్గ్, లక్నో, ఉత్తరప్రదేశ్
సంప్రదింపు:     9450966551, 0551-2255453, 0551-2255454
ఇ-మెయిల్:     yogiadityanath72@gmail.com
వెబ్సైట్: http://www.yogiadityanath.in/
 

ఆసక్తికరమైన సమాచారం

>> యోగి ఆదిత్యనాథ్ 'హిందీ వీక్లీ', మాస పత్రిక 'యోగవాణి'కి చీఫ్ ఎడిటర్.

>> 'హిందూ యువ వాహిని' అనే యువజన సంస్థ వ్యవస్థాపకుడు కూడా.

>> ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా ఎక్కువ రోజులు కొనసాగిన రికార్డు యోగి ఆదిత్యనాథ్ పేరిట ఉంది.
 

click me!